చస్తే అలా చేయను.. క్షమించండి అంటున్న సుడిగాలి సుధీర్..

Sudigali Sudheer: జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 8, 2020, 10:57 PM IST
చస్తే అలా చేయను.. క్షమించండి అంటున్న సుడిగాలి సుధీర్..
సుడిగాలి సుధీర్
  • Share this:
జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలతో ఎంత మ్యాజిక్ చేస్తారో.. టీవీల్లో సుధీర్ కూడా అంతే మ్యాజిక్ చేస్తున్నాడు. ఆయన ఏ షో చేసినా కూడా బ్లాక్‌బస్టరే. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రేటింగ్స్ వర్షం కురుస్తుంది. ఎందుకంటే మనోడి యాంకరింగ్ అయినా.. కామెడీ అయినా కూడా అలా ఉంటుంది మరి. అందుకే సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఈయనతో షోస్ ప్లాన్ చేయడానికి చాలా ఆసక్తి కూడా చూపిస్తుంటారు. ప్రస్తుతానికి మల్లెమాలకు కట్టప్పలా మారిపోయాడు ఈయన.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)


జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు చేస్తున్నాడు. అయితే ఇంత ఇమేజ్ ఉన్న సుధీర్ ఇప్పుడు ఒక్క మాటంటే భయపడిపోతున్నాడు. సన్నిహితుల దగ్గర కూడా తప్పు చేసానని ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. అదే హీరో కావడం.. ఇక్కడ ఉన్న ఇమేజ్ చూసి పెద్ద తెరపై కూడా సక్సెస్ అవతాననే నమ్మకంతో హీరోగా నటించాడు ఈయన. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాతో పాటు ఈ మధ్యే తన టీంతో కలిసి నటించిన 3 మంకీస్ సినిమా కూడా ఎప్పుడొచ్చి వెళ్లిందో తెలియదు. దాంతో ఇకపై హీరోగా నటించడం అంటే కిలోమీటర్ దూరం పారిపోవాలని చూస్తున్నాడు ఈ కమెడియన్.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)


ఎవరు స్క్రిప్ట్ తీసుకొచ్చినా కూడా తను బుల్లితెరపైనే ఉంటానని చెబుతున్నాడు. ఇప్పట్లో ఇంక సినిమాలు చేయకుండా హాయిగా చిన్నితెరపై తన ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు సుధీర్. అదే సేఫ్ కూడా.. లేదంటే లేనిపోని ప్రయోగాలకు పోతే ఉన్న ఇమేజ్ కూడా పోయే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే యాంకర్ రవి, ధన్‌రాజ్, షకలక శంకర్ లాంటి వాళ్లు కూడా హీరోలుగా ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు సుధీర్ చేరిపోయాడు. త్వరలోనే యాంకర్ ప్రదీప్ కూడా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అంటూ చెప్పడానికి వచ్చేస్తున్నాడు. మరి ఈయన జాతకం ఎలా ఉండబోతుందో..?
First published: April 8, 2020, 10:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading