సుడిగాలి సుధీర్ చేసిన పనికి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫిదా..

బాలయ్య సుడిగాలి సుధీర్ (balakrishna sudheer)

Sudigali Sudheer: అవును నిజమే.. ఇప్పుడు సుధీర్ చేసిన పనికి బాలయ్య ఫ్యాన్స్ నిజంగానే ఫిదా అయిపోతున్నారు. మనోడు ఏం చేసినా కూడా బుల్లితెరపై సంచలనమే. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో..

  • Share this:
అవును నిజమే.. ఇప్పుడు సుధీర్ చేసిన పనికి బాలయ్య ఫ్యాన్స్ నిజంగానే ఫిదా అయిపోతున్నారు. మనోడు ఏం చేసినా కూడా బుల్లితెరపై సంచలనమే. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు మార్కెట్ క్రియేట్ చేసుకున్న సుడిగాలి సుధీర్.. ఇప్పుడు తన స్థాయి పెంచుకుంటున్నాడు. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే నిజంగానే మెంటల్ వచ్చేస్తుంది. స్టార్ హీరోలు సినిమాలతో ఎంత మ్యాజిక్ చేస్తారో.. టీవీల్లో సుధీర్ కూడా అంతే మ్యాజిక్ చేస్తున్నాడు. ఆయన ఏ షో చేసినా కూడా బ్లాక్‌బస్టరే. ఎక్కడ అడుగు పెడితే అక్కడ రేటింగ్స్ వర్షం కురుస్తుంది. ఎందుకంటే మనోడి యాంకరింగ్ అయినా.. కామెడీ అయినా కూడా అలా ఉంటుంది మరి.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)


అందుకే సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఈయనతో షోస్ ప్లాన్ చేయడానికి చాలా ఆసక్తి కూడా చూపిస్తుంటారు. ప్రస్తుతానికి మల్లెమాలకు కట్టప్పలా మారిపోయాడు ఈయన. జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఈయనపైనే షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఉగాది సందర్భంగా పండగ సర్ పండగ అంతే అంటూ ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది ఈటీవీ. అందులో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. ముఖ్యంగా మనోడు చేసిన ఓ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్వాతిలో ముత్యమంత అంటూ బాలయ్యను మరిపించేలా రెయిన్ డాన్స్ చేసాడు సుధీర్. బంగారు బుల్లోడు పాటకు ఈ బుల్లోడు పిచ్చెక్కించే స్టెప్పులేసాడు.

సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో (Source: Youtube)
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో (Source: Youtube)


వైట్ అండ్ వైట్‌లో సుధీర్ చేసిన డాన్సులు అదిరిపోయాయి. ముఖ్యంగా పాటలో వేసిన రెండు మూడు స్టెప్పులు అయినా కూడా స్టైల్‌తో చంపేసాడు సుధీర్. ఈ ఈవెంట్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా జీ తెలుగులో నాగబాబు మెయిన్ రోల్‌లో బాబుగారింట్లో బుట్టభోజనం ఈవెంట్ చేస్తున్నారు. దానికి తీసిపోకుండా ఈ వేడుక చేస్తున్నారు మల్లెమాల టీం. సుధీర్‌తో పాటు శ్రీముఖి, రోజా లాంటి చాలా మంది ఇందులో ఉన్నారు. హైపర్ ఆది కూడా ఇందులో డాన్సులతో పాటు పాటలు కూడా పాడి అలరించాడు. మొత్తానికి తన డాన్సులతో బాలయ్య ఫ్యాన్స్‌కు కమ్మని గిఫ్ట్ ఇచ్చాడు సుడిగాలి సుధీర్.
Published by:Praveen Kumar Vadla
First published: