సుడిగాలి సుధీర్ డాన్సులు కుమ్మేసాడండోయ్.. ఓ లుక్కేయండి మరి..

సాఫ్ట్‌వేర్ సుధీర్ సాంగ్

సుడిగాలి సుధీర్ అనేవాడు ఇప్పుడు కేవలం జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ మాత్రమే కాదు.. స్టార్ కూడా. ఈ షో నుంచి వచ్చిన వాళ్లు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్..

  • Share this:
సుడిగాలి సుధీర్ అనేవాడు ఇప్పుడు కేవలం జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ మాత్రమే కాదు.. స్టార్ కూడా. ఈ షో నుంచి వచ్చిన వాళ్లు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్, రంగ‌స్థ‌లం మ‌హేష్ లాంటి వాళ్లు హీరోలుగా చేసారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అవుతున్నాడు. ఒకేసారి రెండు సినిమలతో వస్తున్నాడు ఈయన. ఒకటి సాఫ్ట్ వేర్ సుధీర్ అయితే మరోటి 3 మంకీస్ సినిమా. ఇందులో సాఫ్ట్ వేర్ సుధీర్ త్వరలోనే విడుదల కానుంది. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో నుంచే కాకుండా బ‌య‌ట కూడా సుడిగాలి సుధీర్ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగిలిన వాళ్ల‌కు లేనంత ఫాలోయింగ్ ఈయ‌న‌కు ఉంది.
Jabardasth Comedian Sudigali Sudheer Software Sudheer movie lyrical video song released and dances superb pk సుడిగాలి సుధీర్ అనేవాడు ఇప్పుడు కేవలం జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ మాత్రమే కాదు.. స్టార్ కూడా. ఈ షో నుంచి వచ్చిన వాళ్లు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్.. sudigali sudheer roja,sudigali sudheer naga babu,jabardasth comedy show,extra jabardasth,sudigali sudheer skits,software sudheer movie trailer,sudigali sudheer software sudheer movie trailer,sudigali sudheer extra jabardasth skits,sudigali sudheer getup srinu,sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సాఫ్ట్‌వేర్ సుధీర్ ట్రైలర్,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ (Facebook/Photo)

కేవ‌లం కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా యాంక‌ర్, మెజీషియ‌న్ ఇలా చాలా చేస్తున్నాడు సుధీర్. ఇవ‌న్నీ చూసి ఈయ‌న క్రేజ్ పెరిగిపోయింది. ఈయ‌న కోసం రాజశేఖర్ రెడ్డి పులిచర్ల క‌థ సిద్ధం చేసాడు. ఈయనతోనే సినిమా చేస్తున్నాడు కూడా. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌లో మాస్ హీరో రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చాడు సుధీర్. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా కోసమే సుధీర్ గెటప్ కూడా మార్చేసాడు. ఇదిలా ఉంటే గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది. అయితే అది విడుద‌ల కాలేదు. ఇక ఈయన హీరో కావడం వెనక చాలా మంది కృషి ఉన్నా కూడా జబర్దస్త్ టీం సపోర్ట్ మాత్రం చాలానే ఉంది.

ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఓ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అందులో డాన్సులు కుమ్మేసాడు సుధీర్. సాధారణంగానే మనోడు మంచి డాన్సర్ అనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పాటలో కూడా అదే చేసి చూపించాడు ఈయన. అయితే ఒక్కటే బ్యాడ్ సెంటిమెంట్ సుధీర్‌ను టెన్షన్ పెడుతుంది. గతంలో జబర్దస్త్ కమెడియన్లు హీరోలుగా సినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు సుధీర్ మాత్రం సక్సెస్ అందుకుంటానంటున్నాడు. ఇందులో దివంగత శివప్రసాద్ కూడా నటించడం విశేషం. మ‌రి ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ టీవీల్లో మాదిరే సినిమాల్లో కూడా రాణిస్తాడేమో చూడాలిక‌.
Published by:Praveen Kumar Vadla
First published: