పవన్ కళ్యాణ్‌ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన సుడిగాలి సుధీర్..

Pawan Kalyan Sudigali Sudheer: పవన్ కళ్యాణ్‌కు అభిమానులు కాదు ఇండస్ట్రీలోనే కొందరు భక్తులు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 8:37 PM IST
పవన్ కళ్యాణ్‌ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన సుడిగాలి సుధీర్..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
పవన్ కళ్యాణ్‌కు అభిమానులు కాదు ఇండస్ట్రీలోనే కొందరు భక్తులు ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్లలో జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఉన్నారు. షకలక శంకర్ అయితే కేరాఫ్ పవర్ స్టార్ అయిపోయాడు. ఇక సుడిగాలి సుధీర్ కూడా అందులో ప్రముఖుడు. ఈయన కూడా పవన్‌కు ఫ్యాన్ కాదు.. ఏసీ, కూలర్ అంతకంటే ఎక్కువ. మనోడు పవన్ పేరు ఎత్తితే చాలు జై కొట్టేస్తుంటాడు. ఈయనతో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా నటించాడు సుధీర్. ఆ రోజుల్లో సినిమా షూటింగ్ జరిగిన తీరు గురించి గుర్తు చేసుకున్నాడు సుధీర్. పవన్ బిహేవియర్ గురించి ఆయన మాటల్లో విని ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
చిరంజీవి పవన్‌తో సుడిగాలి సుధీర్ (chiranjeevi sudigali sudheer)
చిరంజీవి పవన్‌తో సుడిగాలి సుధీర్ (chiranjeevi sudigali sudheer)


సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయినా కూడా చాలా మంది కమెడియన్లు అందులో ఆయనతో కలిసి నటించారు. వాళ్లకు అదో మంచి అనుభూతిగా మిగిలిపోయింది. సినిమా ఫలితంతో పని లేకుండా అందరికీ పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా పరిచయం ఏర్పడింది. అందుకే సర్దార్ అంటే తనకు చాలా యిష్టం అంటున్నాడు సుధీర్. నిజానికి పవన్ షూటింగ్‌లో కూడా హీరోలా అస్సలు ఫీల్ అవ్వడని చెప్పాడు ఈయన. స్టార్ హీరోలు షాట్ అయిపోగానే వెంటనే క్యార్ వ్యాన్‌లోకి వెళ్లిపోతారని. మళ్లీ తమ షాట్ వచ్చినపుడు అసిస్టెంట్ డైరెక్టర్ పిలిస్తే వస్తారని చెప్పాడు సుధీర్.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)

కానీ పవన్ మాత్రం అలా కాదని.. తన షాట్ అయిపోయినా కూడా అక్కడే ఉంటాడని.. చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తుంటాడని చెప్పాడు. నిద్ర వస్తే తన మెడలో ఉన్న ఎర్ర టవల్ తీసుకుని అక్కడే నేల మీద పరుచుకుని పడుకుంటాడని షాకింగ్ విషయాలు చెప్పాడు సుడిగాలి సుధీర్. అసలు ఓ పవర్ స్టార్ అంత సింపుల్‌గా ఉండటం తానెప్పుడూ చూడలేదని చెప్పాడు ఈయన. అసలు తాను పెద్ద హీరో అనే విషయమే ఆయనకు గుర్తుండదని.. అంత సింప్లిసిటీ పవన్ సొంతం అంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఆయన్నుంచి నేర్చుకోవాల్సింది కూడా ఆ సింప్లిసిటీనే అంటున్నాడు ఈయన. పవన్‌తో పరిచయం తన లైఫ్‌లో మరిచిపోలేని అనుభూతి అని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు సుధీర్.

First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading