నానికి సుడిగాలి సుధీర్ డబ్బింగ్ చెప్పడం ఏంటి.. ఈయన రేంజ్ ఏంటి.. ఆయన రేంజ్ ఏంటి అనుకుంటున్నారా..? ఏం చేస్తాం చెప్పండి ఒక్కోసారి అలాంటి చిత్రాలు జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. నిజంగానే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో నాని డబ్బింగ్ చెప్పించుకున్నాడు. అదెప్పుడు జరిగిందో తెలుసా..? బుల్లితెరపై సుధీర్ రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ హీరోలకు కూడా ఆయన క్రేజ్ తక్కువ కాదు. వెండితెరపై వాళ్లు సూపర్ స్టార్స్ అయితే బుల్లితెరపై సుధీర్ సూపర్ స్టార్. అందుకే ఆయనతో స్టార్ హీరోలు కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. ఇప్పుడు కూడా నాని ఇదే చేసాడు. తాజాగా ఈటీవీలో ఉగాది ఈవెంట్ ఘనంగా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రతీసారి పండక్కి అదిరిపోయే ఈవెంట్ చేయడం ఈటీవీ యాజమాన్యానికి అలవాటే. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఇందులో ఎప్పట్లాగే చాలా మంది కమెడియన్లు, సినిమా వాళ్లు, బుల్లితెర నటీనటులు కూడా వచ్చారు. అంతేకాదు సోషల్ మీడియా స్టార్స్, సింగర్స్, డాన్సర్స్‌ను కూడా తీసుకొచ్చారు.
అంతమందికి జడ్జిలుగా సంగీత, పోసాని, మనో లాంటి వాళ్లను తీసుకొచ్చారు. టక్ జగదీష్ ప్రమోషన్స్ కోసం ఈ ఈవెంట్‌కు నాని ప్రత్యేక అతిథిగా వచ్చాడు. హీరోయిన్ రితూ వర్మతో కలిసి వచ్చాడు ఈయన. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్లో సుధీర్‌తో అదిరిపోయే కామెడీ చేసాడు నాని.
దాంతో పాటు నిన్ను కోరి సినిమాలోని అడిగా అడిగా పాటను అక్కడ పాడాడు నాని. అయితే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం సుధీర్. అప్పట్లో ఈటీవీ ఈవెంట్ కోసం సుధీర్ ఈ పాటను పాడాడు. ఇప్పుడు అదే పాటను మరోసారి పాడి వినిపించాడు సుధీర్. అయితే ఈ సారి నాని ఆ పాటను పాడుతున్నట్లుగా కెమెరా ముందు కనిపించాడు. చివర్లో ఈ పాట పాడుతుంది సుధీర్ అంటూ చెప్తాడు నాని. ఈ ప్రోమో అంతా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదే ప్రోమోలో ఇంకా చాలా విచిత్రాలు, విశేషాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Sudigali sudheer, Telugu Cinema, Tollywood