జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటే ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు మెజీషియన్, డాన్సర్ కూడా. మల్టీ టాలెంట్‌తో బుల్లితెరపై రప్ఫాడిస్తున్నాడు ఈ స్టార్. ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడీ షోతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే హీరోగా సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో పాటు 3 మంకీస్ కూడా చేసాడు. ఈ రెండూ డిజాస్టర్ అయ్యాయి. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా చేయబోతున్నాడు ఈయన.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
లాక్డౌన్ కానీ లేకపోయుంటే ఇప్పటికే సుధీర్ సినిమా మొదలై ఉండేది. అందుకే ఇప్పుడు తన లుక్ కూడా మార్చేసాడు ఈయన. తాజాగా గడ్డం మీసాలు పెంచేసి కొత్తగా కనిపిస్తున్నాడు సుధీర్. కోర మీసాలతో ఉన్న సుధీర్ లుక్ కూడా అదిరిపోయింది. ఇదిలా ఉంటే ఈ లుక్ వెనక చాలా కథ కూడా ఉంది. లాక్డౌన్ సందర్భంగా తనను తాను చాలానే మార్చుకున్నాడు సుధీర్. ముఖ్యంగా ఫిజిక్‌పై కూడా ఫోకస్ చేసాడు ఈయన.
సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే రోజూ జిమ్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. ఇక చాలా మంది సెలబ్రిటీస్ తమ ఫిజికల్ ట్రైనర్స్ అదేనండీ జిమ్ ట్రైనర్స్‌కు భారీగానే జీతాలు ఇస్తుంటారు. పెద్ద వాళ్లు అయితే ఏకంగా 10, 20 లక్షలు కూడా ఇస్తుంటారు. ఇప్పుడు సుధీర్ కూడా తన జిమ్ ట్రైనర్‌కు భారీగానే ఇస్తున్నాడు.
ఈయన నెలన్నర రోజులకే లక్షన్నర ఇచ్చాడు. అలా మూడు నెలలకు దాదాపు 3 లక్షలు ఇచ్చాడు సుధీర్. ఈ విషయాన్ని స్వయంగా రష్మి గౌతమ్ బయట పెట్టడం విశేషం. తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన సుధీర్, రష్మీలను హోస్ట్ అలీ ఆడుకున్నాడు. మరోవైపు రష్మి గౌతమ్ కూడా పూర్తిగా సుధీర్‌ను టార్గెట్ చేసింది. ఏదేమైనా కూడా ఈ ఇద్దరూ వచ్చిన ఎపిసోడ్ మాత్రం భారీగానే టీఆర్పీ తీసుకొచ్చేలా కనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.