సుడిగాలి సుధీర్ భయంకరమైన వ్యాధితో బాధ పడుతున్నాడా..?

తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.

Sudigali Sudheer: అదేంటి.. సుడిగాలి సుధీర్ ఏంటి.. వ్యాధి ఏంటి అంత ఆరోగ్యంగా కనిపిస్తాడు కదా.. ఆయనకు ఎక్కడుంది వ్యాధి అనుకుంటున్నారా..? ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో..

  • Share this:
అదేంటి.. సుడిగాలి సుధీర్ ఏంటి.. వ్యాధి ఏంటి అంత ఆరోగ్యంగా కనిపిస్తాడు కదా.. ఆయనకు ఎక్కడుంది వ్యాధి అనుకుంటున్నారా..? ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నాడు. మళ్లీ ఇప్పుడు సుధీర్‌కు ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యే ఈయన హీరోగా కూడా వచ్చాడు. ఈయన నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ గతేడాది విడుదలైంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈ కమెడియన్.

Jabardasth Comedian Sudigali Sudheer opens about his dangerous disease in Alitho Saradaga show pk అదేంటి.. సుడిగాలి సుధీర్ ఏంటి.. వ్యాధి ఏంటి అంత ఆరోగ్యంగా కనిపిస్తాడు కదా.. ఆయనకు ఎక్కడుంది వ్యాధి అనుకుంటున్నారా..? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్.. jabardasth comedy show,sudigali sudheer,sudigali sudheer disease,jabardasth sudigali sudheer,jabardasth comedian sudigali sudheer,sudigali sudheer alitho saradaga promo,sudigali sudheer operation,sudigali sudheer disease news,sudigali sudheer movies,sudigali sudheer rashmi gautam,sudigali sudheer rashmi gautam love affair,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్‌కు వ్యాధి,సుడిగాలి సుధీర్‌కు భయంకరమైన వ్యాధి,తెలుగు సినిమా
సాఫ్ట్‌వేర్ సుధీర్ సాంగ్


అవి విన్న తర్వాత సుధీర్ గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వామ్మో అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అభిమానులు. ముఖ్యంగా తనకున్న వ్యాధి గురించి కూడా చెప్పుకొచ్చాడు ఈయన. తనకు ఈ వ్యాధి ఎందుకొచ్చిందో కూడా తెలియదని చెప్పాడు సుధీర్. ఆ నొప్పులకు ఎందుకు బతికున్నానా అనిపించిందని ఎమోషనల్ అయ్యాడు ఈ కమెడియన్. కదిలితే షాక్ కొట్టినట్లు అయ్యేదని.. ఈ విషయంపై డాక్టర్ దగ్గరకు వెళ్తే.. ఆపరేషన్ చేయాలని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు సుధీర్. తేడా వస్తే కాళ్లు పని చేయవని చెప్పేసరికి తనకేం చేయాలో కూడా అర్థం కాలేదని చెప్పాడు సుడిగాలి సుధీర్.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)


ఈ విషయం విన్న తర్వాత అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అసలు సుడిగాలి సుధీర్‌కు ఏమైంది అంటూ వాళ్లు కూడా టెన్షన్ పడిపోతున్నారు. కొన్నిసార్లు ఆ నొప్పితో చచ్చిపోయేవాన్నని ఏడుపుమొహంతో చెప్పాడు సుధీర్. ఈయన అనారోగ్యం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం సెట్ అయినట్లే కనిపిస్తున్నాడు సుధీర్.

జబర్దస్త్ రష్మీ, సుధీర్ (Sudigali Sudheer Rashmi Gautam)
జబర్దస్త్ రష్మీ, సుధీర్ (Sudigali Sudheer Rashmi Gautam)


ఇక రష్మీ గౌతమ్ రిలేషన్ గురించి కూడా మాట్లాడాడు సుధీర్. తమ మధ్య ఎలాంటి లవ్ లేదని.. కేవలం స్నేహం మాత్రం ఉందని చెప్పాడు సుధీర్. కానీ ఆడియన్స్ మాత్రం అవేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరంటున్నాడు. ఏడేళ్లుగా ఉన్న రిలేషన్ కాబట్టి వాళ్లు తమకు నచ్చినట్లు రాసుకుంటున్నారని చెప్పాడు సుధీర్. మొత్తానికి సుడిగాలి సుధీర్ తన వ్యాధి గురించి చెప్పడంతో ఫ్యాన్స్ కూడా కాస్త కంగారు పడ్డారు. ఆయనకు నయం అయిపోవాలని కోరుకుంటున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: