సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్.. అక్కడ గెలుపెవరిదో మరి..?

Sudigali Sudheer Vs Rajinikanth: సుడిగాలి సుధీర్ ఏంటి రజినీకాంత్‌తో పోటీ పడటం ఏంటి.. అసలేమైనా అర్థం ఉందా..? ఆయన రేంజ్ ఏంటి.. సుధీర్ రేంజ్ ఏంటి కనీసం పోల్చడానికైనా పోలిక ఉండాలి కదా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2020, 3:19 PM IST
సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్.. అక్కడ గెలుపెవరిదో మరి..?
సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్ (sudigali sudheer rajinikanth)
  • Share this:
సుడిగాలి సుధీర్ ఏంటి రజినీకాంత్‌తో పోటీ పడటం ఏంటి.. అసలేమైనా అర్థం ఉందా..? ఆయన రేంజ్ ఏంటి.. సుధీర్ రేంజ్ ఏంటి కనీసం పోల్చడానికైనా పోలిక ఉండాలి కదా అనుకుంటున్నారా..? నిజమే కానీ ఒక్కోసారి ఇలాంటి చిత్రాలు కూడా జరుగుతుంటాయి మరి. అయితే సుధీర్ పోటీ పడేది టీవీలో. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోంచి అడుగు బయట పెట్టడానికి లేదు. అందుకే ఈ సమయాన్ని తెలుగు ఎంటర్‌‌టైన్మెంట్ ఛానెల్స్ బాగా వాడేసుకుంటున్నాయి. కొత్త సినిమాలు అన్నీ వేస్తున్నాయి. ముఖ్యంగా సీరియల్స్ కూడా లేకపోవడంతో ఆ స్లాట్స్ అన్నీ ఇప్పుడు సినిమాలతో నింపేస్తున్నారు ఛానెల్స్ యాజమాన్యం.
సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్ (sudigali sudheer rajinikanth)
సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్ (sudigali sudheer rajinikanth)


అందులో భాగంగానే ప్రతీరోజూ కొత్త సినిమాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతీ శుక్రవారం సరికొత్త సినిమాలు అంటూ మా టీవీ, జెమిని ట్రెండ్ మొదలు పెట్టాయి. లాక్ డౌన్ అయ్యే వరకు ఇది కొనసాగేలా కనిపిస్తుంది. అందులో కొత్త సినిమాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్రిల్ 9 సాయంత్రం రెండు కొత్త సినిమాలు రానున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ తొలిసారి జెమిని ప్లే చేస్తుంటే.. జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ తొలిసారి హీరోగా నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాను మాటీవీలో వేస్తున్నారు.
సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్ (sudigali sudheer rajinikanth)
సుడిగాలి సుధీర్ Vs రజినీకాంత్ (sudigali sudheer rajinikanth)

ఈ రెండు సినిమాలు తొలిసారి టీవీలో వస్తున్నాయి. దాంతో ప్రోమోలు కూడా భారీగానే వేస్తున్నాయి ఛానెల్స్. రెండూ ఫ్లాప్ సినిమాలే.. అయితే ఇప్పుడు సుధీర్ సినిమాకు రేటింగ్స్ బాగా వస్తాయా లేదంటే రజినీకాంత్ సినిమాకు టిఆర్పీ బాగా వస్తుందా అనే ఆసక్తి మొదలైంది. పైగా రెండు సినిమాలు కేవలం అరగంట తేడాలోనే వచ్చేస్తున్నాయి. లొకాలిటీ పరంగా చూసుకుంటే సుడిగాలి సుధీర్ సినిమాకు మంచి రేటింగ్స్ వచ్చేలా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: April 10, 2020, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading