Home /News /movies /

JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER MISSING ETV SANKRANTI EVENT AND HERE THE REASONS PK

Sudigali Sudheer: సంక్రాంతి ఈవెంట్‌కు సుడిగాలి సుధీర్ దూరం కావడానికి కారణమిదేనా..?

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer/YouTube)

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer/YouTube)

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ ఈటీవీగా మారిపోయాడు. అక్కడేం ఈవెంట్స్ జరిగినా కూడా సుడిగాలి సుధీర్ కూడా కనిపించాల్సిందే. నిన్నటికి నిన్న జరిగిన న్యూ ఇయర్ వేడుక డిజేలో కూడా ఉన్నాడు సుధీర్. అందులో ఎప్పట్లాగే తన ఆన్ స్క్రీన్..

ఇంకా చదవండి ...
సుడిగాలి సుధీర్ అంటే కేరాఫ్ ఈటీవీగా మారిపోయాడు. అక్కడేం ఈవెంట్స్ జరిగినా కూడా సుడిగాలి సుధీర్ కూడా కనిపించాల్సిందే. నిన్నటికి నిన్న జరిగిన న్యూ ఇయర్ వేడుక డిజేలో కూడా ఉన్నాడు సుధీర్. అందులో ఎప్పట్లాగే తన ఆన్ స్క్రీన్ ప్రేయసి రష్మి గౌతమ్‌తో కలిసి చిందులేసాడు. చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులేసాడు. అసలు సుధీర్ లేకుండా ఈటీవీలో ఈవెంట్స్ జరగవంటే అతిశయోక్తి కాదేమో..? ఇంకా మాట్లాడితే కేవలం ఆయనపైనే ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తుంటారు యాజమాన్యం. అంతగా ఆయన అక్కడ కలిసిపోయాడు. అలాంటి సుడిగాలి సుధీర్‌ను ఇప్పుడు ఈటీవీ యాజమాన్యం దూరం పెట్టిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఉన్నట్లుండి ఎందుకు అలాంటి అనుమానాలు వస్తున్నాయి అనుకోవచ్చు..? ఇక్కడ ఓ కారణం కూడా లేకపోలేదు. బుల్లితెర సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న సుధీర్ ఈటీవీ డిజైన్ చేసిన సంక్రాంతి ఈవెంట్‌లో కనిపించడం లేదు. నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ సారి అత్తో అత్తమ్మ కూతురో అంటూ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది ఈటీవీ. అందులో రోజా అత్తగారుగా నటిస్తుంటే.. హైపర్ ఆది, అనసూయ.. రాంప్రసాద్, రోహిణి.. వర్ష, ఇమ్మాన్యుయేల్ మూడు జంటలుగా నటించారు.
Atto Attamma Kuthuro Promo 02,Sankranthi Special Event 2021,Hyper Aadi,Anasuya,Rashmi gautam,pradeep machiraju,mla roja,sudigali sudheer,sudigali sudheer missing in etv sankranti 2021 event,rashmi gautam,jabardasth anchor rashmi gautam,jabardasth sudigali sudheer,sudigali sudheer rashmi gautam romance,sudigali sudheer rashmi gautam love,sudigali sudheer rashmi gautam affair,sudigali sudheer rashmi gautam Dhee kings vs queens,telugu cinema,హైపర్ ఆది అనసూయ,సుడిగాలి సుధీర్,రష్మి గౌతమ్ రోజా ప్రదీప్ మాచిరాజు,సుడిగాలి సుధీర్ మిస్సింగ్ సంక్రాంతి ఈవెంట్ అత్తో అత్తమ్మ కూతురో 2021
ఎమ్మెల్యే రోజా (MLA Roja/YouTube)


వాళ్లే అత్తకు తగ్గ అల్లుళ్లు అన్నమాట. అదే కాన్సెప్టుతో ఈవెంట్ ప్లాన్ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి. అందులో అందరూ ఉన్నారు కానీ సుడిగాలి సుధీర్ మాత్రం కనిపించడం లేదు. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మా సుధీర్ అన్న ఎక్కడా అంటూ కింద కామెంట్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు. ఈటీవీ నిర్వహించే ప్రతి ఈవెంట్‌లో కీలకంగా ఉండే సుడిగాలి సుధీర్ ఈ సారి మిస్ కావడం వెనక చాలా కథలు వినిపిస్తున్నాయి. కానీ సరైన కారణం బయటికి రావడం లేదు. గతంలో సుడిగాలి సుధీర్‌పైనే స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేసిన ఈటీవీ ఇప్పుడు ఆయన్నెందుకు దూరం పెట్టిందనేది అర్థం కావడం లేదు.


అయితే ఈటీవీ ఆయన్ని దూరం పెట్టలేదు.. కావాలనే ఈ ఒక్క షోకు ఈయన దూరంగా ఉన్నాడు అని తెలుస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. సుడిగాలి సుధీర్ ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. అలాగే లాక్‌డౌన్‌కు ముందు ఈయన కాలింగ్ సహస్ర సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా కమిటయ్యాడు. వాటికి డేట్స్ అప్పుడే ఇచ్చినా లాక్ డౌన్ కారణంగా కుదర్లేదు. దాంతో వాటిని ఇప్పుడు వరసగా పూర్తి చేస్తున్నాడు సుధీర్. అందుకే ఈయన ఈటీవీ ఈవెంట్‌కు డేట్స్ ఇవ్వలేకపోయాడు. అందుకే ఈ ఒక్క ఈవెంట్‌కు దూరంగా ఉంటున్నట్లు నిర్వాహకులకు చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు