కమెడియన్లు అంటే కేవలం నవ్వించడం మాత్రమే కాదు ఏడిపిస్తారు కూడా. అప్పుడప్పుడూ వాళ్లు చేసే నటనకు కన్నీరు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. చాలా మంది కమెడియన్లలో అలా ఏడిపించే వాళ్లు కూడా ఉన్నారు. సుడిగాలి సుధీర్ కూడా అందులో ఉంటాడు. ఈయన పేరు చెప్తే పెదవిపై చిరునవ్వు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అంత క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. బుల్లితెరపై మనోడు చిన్నసైజ్ కామెడీ మెగాస్టార్. సుధీర్ కనిపిస్తే రేటింగ్స్ వచ్చేస్తాయంతే. అలాంటి ఇమేజ్ తెచ్చుకున్నాడు ఈయన.
సుడిగాలి సుధీర్ పర్ఫార్మెన్స్ (sudigali sudheer)
అందుకే ఈటీవీలో కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ సుధీర్ పేరు మీదే ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు వినాయకచవితికి కూడా ఇలాంటి ఈవెంట్ ప్లాన్ చేసారు. 2020లో అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటూ ప్రోమోస్ కూడా విడుదల చేస్తున్నారు. అందులో సుధీర్ కామెడీకి బదులు ఏడిపించేసాడు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌పై ఓ స్కిట్ చేసాడు సుధీర్. డాన్స్‌తో పాటు అందులో ఎమోషనల్ స్కిట్ కూడా ఉంది.
డాక్టర్‌గా అందరికీ సేవలు అందిస్తూ.. కరోనాకే బలైపోయే స్కిట్ ఇది. ఇంట్లో భార్య గర్భవతి.. అంతలోనే ఈయనకు కరోనా.. కుటుంబానికి దూరంగా ఉంటూ చనిపోయే డాక్టర్‌గా సుధీర్ కంటతడి పెట్టించాడు. ఆయన నటన చూసి అంతా కన్నీరు పెట్టుకున్నారు. అంతగా ఒదిగిపోయాడు ఈయన. గతంలో కూడా సుడిగాలి సుధీర్ ఇలాంటి అద్భుతమైన స్కిట్స్ చేసాడు. మొత్తానికి ప్రస్తుతం నడుస్తున్న కరోనా ట్రెండ్‌కు అనుగుణంగా చేసిన స్కిట్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.