JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER KEY COMMENTS ON HIS FANS BS
ఫ్యాన్స్‌పై సుడిగాలి సుధీర్ సంచలన కామెంట్స్..
దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.
Jabardasth Comedian Sudigali Sudheer : సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా తర్వాత 3 మంకీస్‌తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో ఫ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెర ప్రేక్షకుల హీరో. అతడు టీవీ తెర మీద కనిపిస్తే ప్రేక్షకుల మోముపై నవ్వు చిగురిస్తుంది. తన నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రష్మీతో కలిసి స్క్రీన్ ముందుకు వస్తే తనలోని రొమాన్స్ పీక్ స్టేజీకి చేరుతుంది. నటన, డ్యాన్స్, పాటలు, మ్యాజిక్.. ఇలా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయిన సుధీర్ సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాతో హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రతిభను చూపిస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ సినిమా తర్వాత 3 మంకీస్‌తో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో ఫ్యాన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్సే తన ఫ్యామిలీ అని, వారి వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. ‘నేను హీరోగా చేసిన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. దానికి కారణం నేను ఫ్యామిలీలా భావించే ఫ్యాన్సే. హీరోగా ఓ సినిమాకు కమిట్ అయ్యాను. హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పుడే హీరో ట్యాగ్ వద్దే వద్దు’ అని అన్నాడు సుధీర్.
కాగా, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ సహా సుధీర్ ప్రధాన పాత్రలుగా అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 3 మంకీస్.. చిత్రాన్ని నగేష్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని జబర్దస్త్ అభిమానులు కోరుకుంటున్నారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.