సుధీర్ నా అర్ధ మొగుడు.. క్లారిటీ ఇచ్చిన రష్మీ గౌతమ్..

సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్

Jabardasth : రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. బుల్లి తెర ప్రేమికులు. తెర వెనుక ఎలా ఉంటారో తెలీదు కానీ తెర ముందుకు వచ్చారంటే మాత్రం ప్రపంచంలో తమలాంటి లవర్స్ ఇంకెవరూ లేరన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు.

  • Share this:
    రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. బుల్లి తెర ప్రేమికులు. తెర వెనుక ఎలా ఉంటారో తెలీదు కానీ తెర ముందుకు వచ్చారంటే మాత్రం ప్రపంచంలో తమలాంటి లవర్స్ ఇంకెవరూ లేరన్నట్లు బిల్డప్ ఇస్తుంటారు. సుధీర్ ఏమో తమది ఏడేళ్ల ప్రేమ అంటూ జపం చేస్తుంటే.. రష్మీ ఏమో కొంటె చూపులతో వత్తాసు పలుకుతూ ఉంటుంది. ఇదేదో షోకు రేటింగ్ పెంచేలా ఉంది కదా అని నిర్వాహకులు కూడా వారిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నట్లు మరింత హైప్ క్రియేట్ చేస్తారు. ఆ మాటెలా ఉన్నా సుధీర్, రష్మీ ఇచ్చే హావభావాలు మాత్రం షోకు హైలైట్‌గా నిలుస్తుంటాయి. వాస్తవానికి తమ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని, కాకపోతే బెస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్లే క్లారిటీ ఇచ్చేశారు. ఆ క్లారిటీ ఇచ్చినా మళ్లీ షోలో తమది ఏళ్ల నాటి ప్రేమ అంటుంటారు. తాజాగా.. ఢీ ఛాంపియన్స్‌లో టీమ్ లీడర్లుగా వ్యవహరిస్తున్న వీళ్లు మళ్లీ ప్రేమ పుస్తకాన్ని తెరిచారు. దానిలో సుధీర్ లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రయత్నించడం.. అతడ్ని రష్మీ బకరా చేయడం మళ్లీ కామన్ అయిపోయింది. అయితే.. ఆశ్చర్యకరంగా రష్మీ చేసిన ఒక వ్యాఖ్య మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    అదేంటంటే.. రష్మీ దగ్గరికి సుడిగాలి సుధీర్ వెళ్లగానే యాంకర్ రవి వచ్చి సుధీర్ ఎవరు అని అడగ్గా.. నా అర్ధమొగుడు అని చెప్పడంతో షోలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. షో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆ మాటకు బిత్తరపోయారు. ఈ మాట రష్మీ అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు, ఫోటోలతో హోరెత్తించారు. వాళ్లు బుల్లితెరపై చేసుకున్న పెళ్లికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొందరైతే త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్లతో అభ్యర్థిస్తున్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: