Home /News /movies /

JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER GIVEN SUPER CLARITY ON HIS MARRIAGE PK

Sudigali Sudheer: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుడిగాలి సుధీర్.. కాబోయే అమ్మాయి ఎవరంటే..?

సుడిగాలి సుధీర్ (sudigali sudheer)

సుడిగాలి సుధీర్ (sudigali sudheer)

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే ప్రత్యేకంగా పరిచయాలు కావాలా..? ప్రస్తుతం బుల్లితెరపై ఈయన కంటే తోపులు అయితే ఎవరూ లేరు. నెలలో 30 రోజులు బిజీగానే ఉంటాడు సుధీర్. జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలు కూడా..

సుడిగాలి సుధీర్ అంటే ప్రత్యేకంగా పరిచయాలు కావాలా..? ప్రస్తుతం బుల్లితెరపై ఈయన కంటే తోపులు అయితే ఎవరూ లేరు. నెలలో 30 రోజులు బిజీగానే ఉంటాడు సుధీర్. జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలు కూడా చేసుకుంటూ బిజీ అయిపోయాడు. మధ్యలో వెండితెరపై కూడా తన లక్ పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే హీరోగా రెండు సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు కాలింగ్ సహస్రతో పాటు మరో సినిమాకు కూడా కమిటయ్యాడు.

READ ALSO: సానియా మీర్జా భర్త మాలిక్‌కు బిగ్ షాక్.. ఇక ఇండియాకు మకాం మార్చాల్సిందేనా!

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సుధీర్ పెళ్లి టాపిక్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ లిస్టులో ఈయన కూడా ఉంటాడు. అందుకే సుధీర్ పెళ్లి గురించి టాక్స్ నడుస్తూనే ఉంటాయి. దీనిపై ఈయన కూడా పెద్దగా స్పందించింది లేదు. తన తమ్ముడు పెళ్లి చేసినా తాను మాత్రం ఇప్పటి వరకు చేసుకోలేదు సుధీర్. దానికి కారణం ఒకప్పుడు ఆయన ప్రేమలో ఓడిపోవడమే. ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోవడంతో ఈయన అలాగే మిగిలిపోయాడు. ఆ తర్వాత కుటుంబం కోసం పాటు పడుతూ పెళ్లి గురించి మరిచిపోయాడు.

sudigali sudheer,sudigali sudheer marriage,sudheer rashmi marriage,sudigali sudheer marriage date,rashmi sudheer marriage,sudigali sudheer marriage photos,sudigali sudheer marriage news,sudigali sudheer marriage announcement,rashmi marriage with sudigali sudheer,sudigali sudheer rashmi,sudigali sudheer comedy,sudheer rashmi marriage video,sudigali sudheer gives clarity,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,సుడిగాలి సుధీర్ పెళ్లి
సుడిగాలి సుధీర్ (Source: Twitter)


ఇప్పుడు లైఫ్‌లో బిజీ అయిపోయాడు. అయితే రష్మి గౌతమ్‌తో ఈయనకు ఏదో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై కూడా స్పందించాడు సుధీర్. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. స్క్రిప్ట్ ప్రకారమే అలా చేస్తుంటామని చెప్పాడు. అంతకుమించి తమ మధ్య ఏం లేదని.. అలా అనుకుంటే తమకు వచ్చే నష్టమేం లేదని చెప్పుకొచ్చాడు సుడిగాలి సుధీర్. అంతేకాదు తన పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు సుడిగాలి సుధీర్. అసలు తనకు జీవితంలో పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని షాకింగ్ కామెంట్స్ చేసాడు.

sudigali sudheer,sudigali sudheer marriage,sudheer rashmi marriage,sudigali sudheer marriage date,rashmi sudheer marriage,sudigali sudheer marriage photos,sudigali sudheer marriage news,sudigali sudheer marriage announcement,rashmi marriage with sudigali sudheer,sudigali sudheer rashmi,sudigali sudheer comedy,sudheer rashmi marriage video,sudigali sudheer gives clarity,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,సుడిగాలి సుధీర్ పెళ్లి
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)


ఎప్పుడూ ఇలాగే సింగిల్‌గానే ఉండిపోవడమే బాగుంటుందేమో అనిపిస్తుందని సుధీర్ చెప్తున్నాడు. తనకు పెళ్లి చేసుకోవాలని లేకపోయినా కూడా ఇంట్లో వాళ్లు మాత్రం చావగొడుతున్నారని చెప్పాడు సుధీర్. కచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ప్రాణం తీస్తున్నారని చెప్పాడు సుధీర్. ఒకవేళ అన్నీ అర్థం చేసుకునే అమ్మాయి వస్తే ఆలోచిస్తానని చెప్పాడు సుధీర్. తనను చేసుకోబోయే అమ్మాయి మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకున్నాడు ఈయన. అలాంటి అమ్మాయి దొరికితే ఆలోచిస్తానంటూ చెప్పుకొచ్చాడు సుడిగాలి సుధీర్. మరి అలాంటి అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు