హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అరుదైన రికార్డు.. తెలుగు బుల్లితెర నుంచి ఒకే ఒక్కడు..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అరుదైన రికార్డు.. తెలుగు బుల్లితెర నుంచి ఒకే ఒక్కడు..

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకేఒక్క ఛానెల్‌లో ఉంటూ ఎంతో పేరు సంపాదించుకున్నాడు ఈయన. అలాంటి సుధీర్ ఇప్పుడు మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. నిజానికి ఈటీవీలో చాలా..

సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకేఒక్క ఛానెల్‌లో ఉంటూ ఎంతో పేరు సంపాదించుకున్నాడు ఈయన. అలాంటి సుధీర్ ఇప్పుడు మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. నిజానికి ఈటీవీలో చాలా కార్యక్రమాలు సుడిగాలి సుధీర్ ఇమేజ్‌ను బేస్ చేసుకుని నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో..? ఢీ షో నిజానికి డాన్స్ బేస్డ్ అయినా కూడా అందులో సుధీర్ కామెడీ అదిరిపోతుంది. ఆయన చుట్టూనే కామెడీ స్కిట్స్ అల్లేస్తుంటారు దర్శక నిర్మాతలు. అంత క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. ఇదిలా ఉంటే సుధీర్‌ను అల్లరి పెడుతూ కామెడీ చేయడమే ఎప్పుడూ చూస్తుంటాం. కానీ ఈయనకు ఓ అరుదైన గౌరవాన్ని కూడా ఇచ్చింది ఢీ షో. అందులోనే కొన్నేళ్లుగా ఉంటూ తనదైన సత్తా చూపిస్తున్న సుధీర్‌కు మరిచిపోలేని గిఫ్ట్ వచ్చింది. తాజాగా తెలుగు బుల్లితెరపై మరే కమెడియన్‌కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు సుధీర్. దేశవ్యాప్తంగా చాలా అరుదుగా దక్కే గౌరవం ఇప్పుడు సుధీర్ కూడా సాధించి చూపించాడు. దేశవ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. అందులో సుడిగాలి సుధీర్ పేరు కూడా ఉంది. తెలుగు నుంచి మరెవరికి కూడా ఈ ఘనత దక్కలేదు. ఉత్తమ ఎంటర్‌టైనర్‌ విభాగంలో తెలుగు నుంచి సుడిగాలి సుధీర్ ఎంపికయ్యాడు. ఈయన హోస్ట్ చేస్తున్న ఢీ షో నుంచి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ విభాగంలో కపిల్ శర్మ కూడా ఉన్నాడు. ఈయన హిందీలో బెస్ట్ టెలివిజన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచాడు.

సుడిగాలి సుధీర్ (sudigali sudheer)
సుడిగాలి సుధీర్ (sudigali sudheer)

అలాగే తమిళంలో పుగళ్.. బెంగాళీలో అభిర్ చటర్జీ.. మరాఠీలో భానూ కదమ్ ఈ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో ఎంటర్‌టైనర్స్‌గా ఉన్నారు. సుడిగాలి సుధీర్ సాధించిన ఈ రికార్డు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మా సుధీర్ అన్న తోపు.. దమ్ముంటే ఆపు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కొన్ని రోజుల కింద ఇదే ఢీ షో సుధీర్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. అందులో ఓ కంటెస్టెంట్ సుధీర్ జీవితాన్నే డాన్స్ చేసి చూపించాడు.

sudigali sudheer,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer record,sudigali sudheer dhee show,sudigali sudheer dhee new season,sudigali sudheer ormax media,sudigali sudheer best television entertainer,telugu cinema,సుడిగాలి సుధీర్,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఆర్మాక్స్ మీడియా,సుడిగాలి సుధీర్ బెస్ట్ టెలివిజన్ ఎంటర్‌టైనర్
రష్మి గౌతమ్,, సుడిగాలి సుధీర్ (Rashmi Gautam Sudigali Sudheer)

ఆయన జీవితాన్ని వీళ్లు 5 నిమిషాల డాన్స్‌తో చూపించారు. దాంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. సుధీర్ లైఫ్‌లో ఎదుర్కొన్న కష్టాలు.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ చూపించారు ఈ డాన్స్‌లో. దాంతో సుధీర్ కూడా కన్నీరు ఆపుకోలేకపోయాడు. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత వెంటనే అక్కడున్న వాళ్లంతా వచ్చి సుధీర్‌ను కౌగిలించుకుని ఓదార్చారు.. సుధీర్ రేంజ్ ఇది అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఇప్పుడు ఇదే షో నుంచి ఈయన బెస్ట్ ఎంటర్‌టైనర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు