జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్‌కు కరోనా వచ్చిందటూ వచ్చిన ప్రచారం చూసి మొన్నటి నుంచి కూడా అభిమానులు కంగారు పడుతున్నారు. అసలు ఏం జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు అంతలోనే జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా కరోనా బారిన పడిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు లీడింగ్ యాంకర్స్ ఇద్దరూ కరోనా బారిన పడటంతో నిర్మాతల్లో కూడా టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడూ బిజీగానే ఉంటాడు సుడిగాలి సుధీర్. ఆయన డేట్స్ ఎప్పుడూ హాట్ కేక్గానే ఉంటాయి. చాలా షోలు చేస్తూ ఉంటాడు సుధీర్. ఓ వైపు జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరోవైపు ఢీ ఛాంపియన్స్ కూడా చేస్తున్నాడు సుధీర్. అలాంటిదిప్పుడు సుధీర్‌కు కరోనా లక్షణాలు బయటపడటంతో అక్టోబర్ 18న ఈయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడని.. దాంతో సుధీర్‌ను నమ్ముకుని ప్లాన్ చేసుకున్న షోలన్నీ కాస్త టెన్షన్లో పడ్డట్లు తెలుస్తుంది.
ఇన్ని వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు సుధీర్ వైపు నుంచి మాత్రం తనకు కరోనా వచ్చిందనే వార్తను మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. మరోవైపు రష్మికి కూడా కరోనా వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈయన కరోనా మహమ్మారిని త్వరగా జయించాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో మెసేజులు పెడుతున్నారు. రష్మి గౌతమ్ కూడా కరోనా బారిన పడిందని తెలిసిన తర్వాత.. రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ఎలా ఉన్నారనేది అర్థం కాని విషయం.
ఏదెలా ఉన్నా కూడా సుధీర్ ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీగా ఉన్నాడు. వరస సినిమాలు కూడా చేస్తున్నాడు ఈయన. ఈ మధ్యే కాలింగ్ సహస్ర సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు సుధీర్. కరోనా బారిన పడటంతో అన్నింటికీ ఒకేసారి బ్రేకులు పడ్డాయి. ఏదేమైనా కూడా కరోనా బారిన పడటంతో నిర్మాతల్లో మాత్రం ఓ రకమైన టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంది. ఆయనే బయటికి వచ్చి ఏం జరిగిందో చెప్పేవరకు ఈ కంగారు అయితే తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sudigali sudheer, Telugu Cinema, Tollywood