JABARDASTH COMEDIAN SUDIGALI SUDHEER BIRTHDAY SPECIAL AND HERE SOME INTERESTING DETAILS PK
సుడిగాలి సుధీర్ బర్త్ డే స్పెషల్.. మీకు తెలియని నిజాలు..
దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.
Sudigali Sudheer Birthday: ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుధీర్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎలా వచ్చాం.. ఎక్కడ్నుంచి వచ్చాం..
ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుధీర్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎలా వచ్చాం.. ఎక్కడ్నుంచి వచ్చాం.. అనేది కాదు ఎలా ఎదిగాం.. ప్రస్తుతం మనమెక్కడున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సుధీర్ కూడా ఇదే చేసి చూపించాడు. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు వచ్చారు.. వెళ్లిపోయారు కానీ కొందరు మాత్రమే అక్కడే సెటిల్ అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు సుడిగాలి సుధీర్. ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే ఉన్నాడు. మే 19న ఈయన పుట్టిన రోజు. 1987లో పుట్టాడు సుధీర్.
సుడిగాలి సుధీర్
బుల్లితెరపై ప్రస్తుతం ఉన్న కమెడియన్స్‌లో నెంబర్ వన్ సుధీర్ అంటే అతిశయోక్తి కాదు. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌గా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. ఈ మధ్యే సాఫ్ట్వేర్ సుధీర్ అంటూ హీరో అయ్యాడు కూడా. మిగిలిన సినిమాల్లో కూడా చిన్నచిన్న పాత్రలు చేసాడు ఈయన. ఆ తర్వాత 3 మంకీస్‌తో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నాడు సుధీర్. ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్.. 30 రోజులు ఫుల్ బిజీగానే ఉన్నాడు. జబర్దస్త్ కామెడీ షోతో పాటు ఇంకా చాలా షోస్ చేస్తున్నాడు సుధీర్.
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటో
అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు తనకంటూ బుల్లితెరపై స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. మ్యాజిక్ చేస్తూ సినిమా వాళ్లకు చేరువైన ఈయన.. గెటప్ శ్రీను పుణ్యమా అని జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు. రూమ్ మేట్స్ అయిన సుధీర్, శ్రీను.. ఆ తర్వాత టీమ్ మేట్స్ అయ్యారు. శ్రీనునే జబర్దస్త్ కమెడియన్ వేణుకు పరిచయం చేయడం.. ఆ తర్వాత జబర్దస్త్‌లో ఎంట్రీ.. స్టార్ డమ్ జరిగాయి. ఏడేళ్లుగా వెనక్కి తిరిగి చూసుకోకుండా సుధీర్ జర్నీ సాగుతుంది. ఇక ఈయన కెరీర్లో రష్మి గౌతమ్ ఎప్పుడూ ప్రత్యేకమే. చెప్పుకునేంత రిలేషన్ వీళ్ల మధ్య లేకపోయినా.. గాసిప్స్ రాసుకునేంత రిలేషన్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సంపాదన విషయంలో కూడా సుడిగాలి సుధీర్ దూకుడు చూపిస్తున్నాడు. ఈయన ఆస్తి విలువ ఎంతుంది అని తెలుసుకోడానికి అభిమానులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఈయన ప్రస్తుత ఆస్తి లెక్కలు కడితే దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని ప్రచారం అయితే గట్టిగానే జరుగుతుంది. ఏడాదికి కనీసం 25 నుంచి 35 లక్షలు మధ్యలో సంపాదిస్తున్నాడు సుధీర్. అందులో జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా కూడా చిన్న స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదగడం కూడా మాటలు కాదు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.