Sudigali Sudheer Rashmi: బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే.
బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదరగొట్టింది. తాజాగా ఢీ జోడీ ఫైనల్లో ఈ ఇద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది. సోషల్ మీడియాలో ఈ డాన్సులకు వ్యూస్ షేక్ అవుతున్నాయి. అంతగా రప్ఫాడిస్తున్నారు సుధీర్ రష్మీ జోడీ. ఎప్పటికప్పుడు కొత్త డాన్సులతో అలరించే ఈ జోడీ.. వెండితెరపై కూడా మెరిసేందుకు సిద్ధం అవుతున్నారు.
ప్రతీ ఈవెంట్లోనూ అదిరిపోయే కెమిస్ట్రీతో పిచ్చెక్కిస్తుంటారు ఈ జోడీ. దాంతో ఈ ఇద్దరితో సినిమా చేయాలని ఓ నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు.. సుడిగాలి సుధీర్‌ను హీరో చేసిన శేఖర్ రాజు.. గతేడాది సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాను నిర్మించిన శేఖర్ రాజు ఇప్పుడు మరోసారి సుధీర్‌ను హీరోగా పెట్టి సినిమా చేయాలని చూస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ ఫ్లాప్ అయినా కూడా తనకు మాత్రం భారీగానే లాభాలు వచ్చాయని చెప్పాడు శేఖర్ రాజు. అందుకే సుధీర్ హీరోగా మరో సినిమా చేస్తానంటున్నాడు.
నిజానికి సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలోనే రష్మి గౌతమ్‌ను హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు దర్శక నిర్మాతలు. కానీ కుదర్లేదు.. ఆ సమయానికి డేట్స్ క్లాష్ రావడంతో రష్మి ఈ సినిమా చేయలేకపోయింది. దాంతో ధన్య బాలకృష్ణన్ నటించింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ జోడీని వదిలే సమస్య లేదంటున్నాడు శేఖర్ రాజు. కచ్చితంగా సుధీర్, రష్మితో సినిమా చేస్తానంటున్నాడు. ఇప్పటికే డేట్స్ కూడా లాక్ చేసాడని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే సుధీర్, రష్మి జంటగా సినిమా వస్తే.. కాస్త బాగున్నా కూడా వాళ్ల క్రేజ్‌తో మంచి వసూళ్లు తీసుకురావడం ఖాయం.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.