జబర్దస్త్ కమెడియన్ కక్కూర్తి పనికి చెంప చెళ్లుమనిపించిన యాంకర్...షో మధ్యలోనే...

ప్రతీకాత్మకచిత్రం

ఓ వైపు హైపర్ ఆది లాంటి చురుకైన హోస్ట్ తో చేస్తూనే, మరోవైపు తన కన్నా సీనియర్ పంచ్ పితామహా లాంటి చలాకీ చంటితో కలిసి యాంకరింగ్ చేయడం ఒక రకంగా వర్షిణికి చాలెంజ్ అనే చెప్పాలి. అయినప్పటికీ రాటుదేలుతూ వర్షిణి శభాష్ అనిపించుకోంటుంది.

 • Share this:
  పటాస్ షోలో నిలదొక్కుకోవడం కోసం తెగ కష్టాలు పడుతున్న యాంకర్ వర్షిణి తన స్థానం కోసం పడరాని పాట్లు పడుతోందని టాక్ వినిపిస్తోంది. త్వరలో తన స్థానంలో మరోసారి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో వర్షిణి తన సత్తా చాటేందుకు కాస్త బోల్డ్ గా మారింది. ముఖ్యంగా చలాకీ చంటి వచ్చిన తర్వాత వర్షిణి ఇంకాస్త బోల్డ్ గా మారింది. ఇప్పటికే ఆడియన్స్ బుగ్గలు కొరికిన వివాదంలో ఇరుక్కున్న వర్షిణి, ఎవరేం అనుకున్నా పర్లేదు తాను మాత్రం వివాదాలతో పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో వర్షిణి తన ప్రయాణం కొనసాగిస్తోంది. అయితే తాజాగా మాత్రం వర్షిణి పటాస్ స్టేజీ మీద జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ చేసిన పనికి చెంప చెళ్లుమనిపించింది. నిజానికి అవినాష్ తో కలిసి ఒక స్కిట్ చేస్తుండగా, అవినాష్ కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. వర్షిణి కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. లవ్ క్లాసెస్ తర్వాత బెడ్రూం క్లాసెస్ ఉంటాయి. అంటూ అవినాష్ చేసిన కామెంట్ తో వర్షిణి కాస్త ఇరిటేట్ అయ్యిందనే చెప్పాలి. ఎప్పుడూ జోవియల్ గా ఉండే వర్షిణి అవినాష్ చెంప చెళ్లు మనిపించింది. అవినాష్ కూడా ఈ సంఘటనతో షాక్ తిన్నాడు. అయితే కెమెరా ముందు మాత్రం ఏమి జరగనట్లు నటించినట్లు టాక్ వినిపిస్తోంది.

  మరోవైపు వర్షిణి మాత్రం పటాస్, అలాగే ఢీ షోలో తన స్థానం ఖరారు చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఓ వైపు హైపర్ ఆది లాంటి చురుకైన హోస్ట్ తో చేస్తూనే, మరోవైపు తన కన్నా సీనియర్ పంచ్ పితామహా లాంటి చలాకీ చంటితో కలిసి యాంకరింగ్ చేయడం ఒక రకంగా వర్షిణికి చాలెంజ్ అనే చెప్పాలి. అయినప్పటికీ రాటుదేలుతూ వర్షిణి శభాష్ అనిపించుకోంటుంది.

  (Image: Youtube)


  Published by:Krishna Adithya
  First published: