Jabardasth Shanthi Swaroop: తండ్రి చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. జబర్దస్త్ కమెడియన్ కన్నీటిగాథ..

Jabardasth Shanthi Swaroop: నవ్వించే వాళ్ల జీవితాల్లో నవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు.. నవ్వించినంత మాత్రానా వాళ్ల జీవితం బాగున్నట్లు కాదు. దానికి నిదర్శనం జబర్దస్త్ కమెడియన్స్ జీవితమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 2:22 PM IST
Jabardasth Shanthi Swaroop: తండ్రి చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. జబర్దస్త్ కమెడియన్ కన్నీటిగాథ..
శాంతి స్వరూప్ (shanti swaroop)
  • Share this:
నవ్వించే వాళ్ల జీవితాల్లో నవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. పైకి కనిపించేదంతా నిజం కాదు.. నవ్వించినంత మాత్రానా వాళ్ల జీవితం బాగున్నట్లు కాదు. దానికి నిదర్శనం జబర్దస్త్ కమెడియన్స్ జీవితమే. ఎందుకంటే వాళ్లెప్పుడూ పైకి నవ్వుతూనే ఉంటారు.. అందర్నీ నవ్విస్తూ ఉంటారు కానీ వాళ్ల రియల్ లైఫ్‌లో మాత్రం చాలా ఏడుపులు ఉంటాయి.. కన్నీరు పెట్టించే విషాదాలు కూడా ఉంటాయి. అవి తలుచుకున్నపుడు కచ్చితంగా మనకు కూడా కన్నీరు వస్తాయి. చాలా మంది కమెడియన్లు స్టేజీపై ఏ బాధలు లేనట్లు నవ్వుతూ కనిపిస్తారు.. కానీ వాళ్ల లోపల జీవితం ఒక్కసారి స్పృషిస్తే మాత్రం విషాదాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి బాధాకరమైన సంఘటనను ఓ జబర్దస్త్ కమెడియన్ గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి చనిపోతే కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేని దారుణమైన పరిస్థితిని చూసాడు ఓ కమెడియన్. అతనెవరో కాదు శాంతి స్వరూప్. జబర్దస్త్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈయన.

జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ (jabardasth shanti swaroop)
జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ (jabardasth shanti swaroop)


లేడీ గెటప్స్ వేసుకుంటూ ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నాడు. ఆర్థికంగా కూడా బాగానే కుదురుకున్నాడు కూడా. అయితే తనకు ఒకప్పుడు జీవితంలో కష్టాలు, కన్నీరు తప్ప మరోటి లేవని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తనది పెద్ద కుటుంబం అని.. నిరుపేద జీవితం అని చెప్పుకొచ్చాడు శాంతి. తనకు జబర్దస్త్ నుంచి వచ్చేది కూడా తక్కువే ఉంటుందని.. కానీ బయట ఈవెంట్స్ చేసినపుడు మాత్రమే బాగా వస్తాయని అసలు నిజాలు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే తన వ్యక్తిగత జీవితం గురించి చెప్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు శాంతి స్వరూప్. మరీ ముఖ్యంగా 2007లో తన తండ్రి చనిపోయాడని.. అప్పుడు నరకం చూసానని చెప్పాడు ఈయన.

జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ (jabardasth shanti swaroop)
జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ (jabardasth shanti swaroop)


ఎందుకంటే తన తండ్రి చనిపోయినపుడు హైదరాబాద్‌లో ఉన్నానని.. అప్పుడు అంత్యక్రియల కోసం 2 వేలు కావాల్సి వచ్చిందని చెప్పాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో 500 కూడా లేవని.. అలాంటిది 2 వేలు అనేది చాలా పెద్ద మొత్తం అని చెప్పాడు. ఏడ్చుకుంటూ ఎన్నో తిప్పలు పడ్డానని.. చివరికి తాను అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ అన్న దగ్గర అప్పు తీసుకున్నానని చెప్పాడు. ఆయన అకౌంట్ నెంబర్ అడిగితే అది కూడా లేదని చెప్పానని.. అప్పుడు ఇంటి పక్కన ఎవరో అకౌంట్‌లో వేస్తే అలా వెళ్లి తీసుకొని ఊరికి వెళ్లి నాన్న అంత్యక్రియలు చేసానని చెప్పాడు శాంతి.

జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ (jabardasth shanti swaroop)
జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్ (jabardasth shanti swaroop)


జీవితంలో ఇలాంటి కష్టాలు మాత్రం ఎవరికీ రాకూడదనే కోరుకుంటానని చెప్పాడు ఈయన. ఊళ్లో మాత్రం చాలా మంది వీడికేం సినిమాల్లో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు అనుకుంటారని.. కానీ ఇక్కడ పరిస్థితులు వాళ్లకు తెలియవని చెప్పాడు. అంతేకాదు జబర్దస్త్‌లో కూడా లక్షలకు లక్షలు వస్తాయనే భ్రమ బయట ఉందని.. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందని.. ఇక్కడికి వచ్చి చూసినపుడే కదా అసలు విషయం తెలిసేది అంటున్నాడు శాంతి స్వరూప్. ప్రస్తుతం ఈయన హైపర్ ఆదితో పాటు కార్తిక్ టీంలో రెగ్యులర్‌గా స్కిట్స్ చేస్తుంటాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading