జబర్ధస్త్ కామెడీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. గత ఐదేళ్లుగా ఈ ప్రోగ్రామ్‌ టీఆర్‌పీని బీట్ చేసే ప్రోగ్రామ్ ఏది లేదు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌లో ఆడ వేషంతో అలరించే వినోద్‌పై దాడి జరిగింది. హైదరాబాద్‌లోని  కుత్బిగూడలో అతను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ వినోద్ పై హత్యాయత్నం చేసినట్టు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనలో వినోద్‌ కంటి భాగంలో తీవ్ర గాయమైంది. అసలు ఇంటి ఓనర్..అతినిపై ఎందుకు దాడి చేసినట్టు పోలీసులు విచారిస్తున్నారు. గతంలో వినోద్ పలు సందర్భాల్లో వార్తల్లో నిలిచాడు.

జబర్ధస్త్ కమెడియన్ వినోద్ పై దాడి.. తీవ్రంగా గాయపడిన నటుడు..
తీవ్రంగా గాయపడిన వినోద్ (ఫేస్‌బుక్ ఫోటో)


గతంలో అతని ఫ్యామిలీ మెంబర్స్ అతనికి పెళ్లి చేయడానిక ప్రయత్నించగా వినోద్ చేతి మణికట్టును కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది. తాజాగా వినోద్ అద్దెకు ఉంటున్న ఓనర్ అతనిపై దాడికి పాల్పడటం గమనార్హం. 

జబర్ధస్త్ కమెడియన్ వినోద్ పై దాడి.. తీవ్రంగా గాయపడిన నటుడు..
తీవ్రంగా గాయాలపాలైన వినోద్