Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 19, 2019, 3:53 PM IST
చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో
చమ్మక్ చంద్ర.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం ఏం అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమంతో పరిచయం ఉన్న వాళ్లందరికీ ఈయన కూడా సుపరిచితుడే. అయినా వీళ్లంతా పేరుకు జబర్దస్త్ కమెడియన్స్ కానీ సినిమా వాళ్లకు ఎంత క్రేజ్ ఉందో అంతకంటే ఎక్కువే ఉంది వాళ్లకు కూడా. ఒక్కొక్కరికి మంచి గుర్తింపు వచ్చిందిప్పుడు. చమ్మక్ చంద్ర కూడా అంతే. ఈయనకు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇప్పడు ఈయన గురించి ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టాడు కమెడియన్ సత్తిపండు.

చమ్మక్ చంద్ర సత్తిపండు
ఈయన కూడా కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే చేస్తున్నాడు. వీళ్లిద్దరి కామెడీ బుల్లితెరపై బ్లాక్ బస్టర్ కూడా. ప్రతీసారి తన స్కిట్స్ లో సత్తిపండును ఇరికిస్తూ మంచి కామెడీ జనరేట్ చేస్తుంటాడు చమ్మక్ చంద్ర. ఇక ఇప్పుడు తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో పాటు చంద్ర గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సత్తిపండు. చమ్మక్ చంద్రను చాలా మంది తక్కువగా అంచనా వేస్తారు.. ఆయనపై లేనిపోని అబాంఢాలు వేస్తారు కానీ ఆయన కంటే మంచోన్ని తానెక్కడా చూడలేదని చెప్పాడు సత్తిపండు.

చమ్మక్ చంద్ర ఫైల్ ఫోటో
ఓ సారి జబర్దస్త్ షూటింగ్ చేస్తున్నపుడు ఎవరో ఓ అనాథ వస్తే తన కళ్ల ముందే చాలా డబ్బులు ఇచ్చాడని.. అలాంటి గుప్తదానాలు చమ్మక్ చంద్ర చాలానే చేసాడని చెప్పుకొచ్చాడు సత్తిపండు. అయితే ఇలాంటి చంద్రపై అప్పట్లో స్వాతినాయుడు సంచలన ఆరోపణలు చేసింది. అమ్మాయిలను వాడుకుంటాడని ఆయనపై అబాంఢాలు వేసింది. అయితే ఇప్పుడు సత్తిపండు చెప్తున్న తీరు మాత్రం మరోలా ఉంది. ప్రస్తుతం ఈయన వెండితెర వైపు వెళ్తున్నాడు. రామసక్కనోళ్లు అనే సినిమాతో లీడ్ హీరోగా మారిపోతున్నాడు చంద్ర. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్సే కదా అని తక్కువ అంచనా వేయకూడదు.. ఎంత సంపాదించినా కూడా అందులో సాయం చేసే గుణం అందరికీ ఉండదు కదా..
Published by:
Praveen Kumar Vadla
First published:
December 19, 2019, 3:53 PM IST