జబర్దస్త్ అవసరం లేదన్న హాట్ బ్యూటీ.. నాగబాబు కావాలని..

Jabardasth: వద్దన్నా కూడా కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కామెడీ షో రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది. నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత మరింత ఆసక్తిగా మారిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 23, 2020, 9:03 PM IST
జబర్దస్త్ అవసరం లేదన్న హాట్ బ్యూటీ.. నాగబాబు కావాలని..
నాగబాబు రోజా ఫైల్ ఫోటోస్ (Naga Babu Roja)
  • Share this:
వద్దన్నా కూడా కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కామెడీ షో రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది. నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత మరింత ఆసక్తిగా మారిపోయింది. ఆయన మానేసిన తర్వాత రేటింగ్స్ తగ్గిపోయాయా.. అలాగే ఉన్నాయా అనేదానిపై కూడా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా రేటింగ్స్ మాత్రం అలాగే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ షో నుంచి చాలా మంది కమెడియన్స్ వెళ్లిపోయారు. చమ్మక్ చంద్రతో పాటు కిరాక్ ఆర్పీ లాంటి వాళ్లు కూడా బైబై చెప్పేసారు. ఇదే దారిలో మరో కమెడియన్ కూడా తనకు జబర్దస్త్ కామెడీ షో అవసరం లేదని చెప్పింది. నాగబాబుకే తన ఓటు అంటూ వెళ్లిపోయింది.

Another Comedian walks out from Jabardasth Comedy Show and he needs Nagababu over Roja pk వద్దన్నా కూడా కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కామెడీ షో రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది. నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత మరింత ఆసక్తిగా మారిపోయింది. ఆయన మానేసిన తర్వాత రేటింగ్స్ తగ్గిపోయాయా.. jabardasth,jabardasth comedy show,pinky jabardasth,sai teja out of jabardasth,nagababu pinky,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth vinod,jabardasth sai teja,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

అతడే సాయి తేజ అలియాస్ పింకీ. ఒకప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో అమ్మాయిలు కనిపించేవారు కాదు. అబ్బాయిలే అలా గెటప్స్ వేసుకునేవాళ్లు. అలాంటి వాళ్లలో సాయితేజ చాలా పాపులర్. ఆ తర్వాత సెక్స్ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు సాయి తేజ. పింకి అలియాస్ ప్రియాంకగా పేరు కూడా మార్చుకున్నాడు సాయి తేజ. అమ్మాయిగా మారిన తర్వాత కూడా తనకు జబర్దస్త్ నుంచి ఆఫర్స్ వచ్చాయని.. కానీ ఇప్పుడు ఇక ఆ షో వైపు వెళ్లనని చెప్పేసింది పింకీ. దానికి కారణం నాగబాబు.. ఆయనతోనే కలిసి పని చేస్తానని అప్పట్లో వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం జబర్దస్త్ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షో జరుగుతుంది.

Another Comedian walks out from Jabardasth Comedy Show and he needs Nagababu over Roja pk వద్దన్నా కూడా కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ కామెడీ షో రోజూ వార్తల్లోనే ఉంటూ వస్తుంది. నాగబాబు ఈ షో నుంచి వెళ్లిపోయిన తర్వాత మరింత ఆసక్తిగా మారిపోయింది. ఆయన మానేసిన తర్వాత రేటింగ్స్ తగ్గిపోయాయా.. jabardasth,jabardasth comedy show,pinky jabardasth,sai teja out of jabardasth,nagababu pinky,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth vinod,jabardasth sai teja,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
ప్రతీకాత్మక చిత్రం

ఇందులో జబర్దస్త్ మాజీ టీం లీడర్స్ ధన్‌రాజ్, వేణుతో పాటు ఇప్పుడున్న కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లే టీమ్ లీడర్స్‌గా షో మొదలైంది. ఇందులో అందరి టీమ్స్‌లో పింకీ కూడా చేస్తుంది. జబర్దస్త్ షోకు ధీటుగా ఇప్పుడు అదిరింది మొదలు పెట్టారు కానీ నిజంగా ఈ షోను బీట్ చేసే సత్తా దానికి ఉందా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఇప్పటికే గడిచిన ఎపిసోడ్స్ జబర్దస్త్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి. జబర్దస్త్ కామెడీ షో విషయానికి వస్తే సుధీర్ ఎప్పటికీ అక్కడే ఉంటానని చెప్పాడు.. హైపర్ ఆదికి అగ్రిమెంట్ అడ్డు పడుతుంది. ఇలా కొందరు మానేయాలనుకున్నా మానేసి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి రాబోయే కాలంలో జబర్దస్త్ షోలో ఇంకెన్ని మార్పులు చూస్తామో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: April 23, 2020, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading