• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH COMEDIAN ROCKING RAKESH POSTED A VIDEO ABOUT HOW TO ENTRY INTO JABARDASTH COMEDY SHOW PK

Jabardasth Rakesh: జబర్దస్త్ రాకేష్ వార్నింగ్.. పిల్లల్ని మోసం చేస్తున్నాడంటూ ఆరోపణలు..

Jabardasth Rakesh: జబర్దస్త్ రాకేష్ వార్నింగ్.. పిల్లల్ని మోసం చేస్తున్నాడంటూ ఆరోపణలు..

రాకింగ్ రాకేష్ (Rocking Rakesh)

Jabardasth Rakesh: జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Comedy Show) చూసే వాళ్లకు రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పిల్లలతో అద్భుతమైన కామెడీ చేయిస్తూ వాళ్లకు లైఫ్ ఇవ్వడమే కాకుండా తనకు కూడా లైఫ్ వచ్చేలా చేసుకున్నాడు ఈయన. అయితే ఇప్పుడు ఈయన కొందరికి వార్నింగ్ ఇస్తున్నాడు.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు రాకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పిల్లలతో అద్భుతమైన కామెడీ చేయిస్తూ వాళ్లకు లైఫ్ ఇవ్వడమే కాకుండా తనకు కూడా లైఫ్ వచ్చేలా చేసుకున్నాడు ఈయన. రాకేష్ టీంలోకి పిల్లలు రాకముందు ఎప్పుడెప్పుడు ఈయన స్కిట్ అయిపోతుందా అన్నట్లుండేది. కానీ యోధ, దీవెన లాంటి చిన్న పిల్లలు వచ్చిన తర్వాత మనోడు స్టార్ అయిపోయాడు. వాళ్లతో అద్భుతమైన కామెడీ చేయించాడు. దాంతో బాల నటులకి కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు రాకేష్. జబర్దస్త్ కామెడీ షోలో పిల్లలు పర్ఫార్మ్ చేయాలంటే రాకేష్‌ను అప్రోచ్ అయితే చాలు అని అంతా అనుకునే వరకు ఆయన ఎదిగాడు. ఈయన స్కిట్స్‌లో చాలా మంది పిల్లలు పరిచయం అయ్యారు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రాకేష్ కొందరికి వార్నింగ్ ఇచ్చాడు. తన పేరుతో కొందరు మోసం చేస్తున్నారని ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ముఖ్యంగా తన పేరు చెప్పి పిల్లలకు అవకాశాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ల దగ్గర డబ్బులు గుంజుతున్నారని ఆయన తెలిపాడు.

ఇదే విషయాన్ని సన్నిహితులతో పాటు ఫేస్ బుక్‌లోనూ పెట్టి మోసపోకండి అంటూ కోరుతున్నాడు. జబర్దస్త్ పేరుతో కొందరు మోసం చేస్తున్నారని.. ముఖ్యంగా అవకాశం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు లాగుతున్నారని చెప్పాడు. జబర్దస్త్‌లోకి రావాలనుకునే వాళ్లు ఏం చేయాలి.. ఎలా చేయాలి అనేది ఓ వీడియో పోస్ట్ చేసాడు రాకేష్. కేవలం న్యాయబద్ధంగానే కష్టపడి జబర్దస్త్‌లోకి రావాలని.. అంతేకానీ అవకాశం ఇచ్చేవాడు డబ్బులు అడగడు అంటూ చెప్పాడు రాకేష్.

పిల్లల తల్లిదండ్రులను కూడా జబర్దస్త్ ఆశ చూపించి.. మోసం చేస్తున్నారని చెప్పాడు ఈయన. అలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు రాకేష్. తన సొంత యూ ట్యూబ్ ఛానెల్ చంటబ్బాయిలో ఈయన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు