Home /News /movies /

JABARDASTH COMEDIAN ROCKING RAKESH KISSED ROSHINI IN EXTRA JABARDASTH SKIT GOES VIRAL ON SOCIAL MEDIA NR

Jabardasth: స్టేజిపైనే బిగ్ బాస్ కంటస్టెంట్‌కు ముద్దు పెట్టిన రాకింగ్ రాకేష్.. అందరూ చూస్తుండగానే??

jabardasth

jabardasth

Jabardasth: బుల్లితెరలో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న కామెడీ షో ఏంటంటే జబర్దస్త్ అనే చెబుతారు. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ షోను విమర్శించని వాళ్లే లేరు. స్కిట్ పేరుతో బాగా

    Jabardasth: బుల్లితెరలో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న కామెడీ షో ఏంటంటే జబర్దస్త్ అనే చెబుతారు. కానీ అదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ షోను విమర్శించని వాళ్లే లేరు. స్కిట్ పేరుతో బాగా రెచ్చిపోతుంటారు. తమకు నచ్చినట్లుగా వేదికపై రచ్చ చేస్తుంటారు. పైగా డబల్ మీనింగ్ మాటలతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇప్పటికే చాలామంది కమెడియన్లు తమకు నచ్చినట్లు ప్రవర్తించడంతో పలు రకాల విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో కమెడియన్ రాకింగ్ రాకేష్ అలాగే చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

    నిజానికి జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో అలరిస్తూ ఉంటారు కొందరు ఆర్టిస్టులు. ఇక వారిపై కమెడియన్స్ చేతులు వేసిన, ఏమి చేసినా ఏమి అనిపించదు. ఎందుకంటే వాళ్లు కూడా పురుషులే కాబట్టి.. అలా చేసినా కూడా తప్పనిపించదు. కానీ ఈ మధ్య జబర్దస్త్ లేడీ కమెడియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఇక వీరితో కలిసి స్కిట్ చేస్తున్నప్పుడు నిజానికి దూరం పాటించాలి. అంతేకాకుండా గౌరవం ఇవ్వాలి. కానీ రాకింగ్ రాకేష్ అందరు చూస్తున్న సమయంలో వేదికపై నేరుగా ఓ లేడీ కమెడియన్ కు ముద్దు పెట్టడంతో ప్రస్తుతం ఈ విషయం గురించి నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

    https://youtu.be/rn2nGCPBMA4?t=50

    తాజాగా జబర్దస్త్ లో వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అందులో రాకింగ్ రాకేష్ తన స్కిట్ లో మరో లేడీ కమెడియన్ రోహిణి తో కలిసి ఓ జాబ్ కోసం వెళ్లగా.. అక్కడ భార్యాభర్తలకు మాత్రమే ఉద్యోగం అని అనడంతో వెంటనే వీళ్ళు ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా అన్నట్లు సన్నిహితంగా ఉంటారు. దీంతో రాకేష్ కూడా చూడండి దగ్గర్నుండి అంటూ రోహిణికి ముద్దు పెట్టడంతో రోహిణి షాక్ అవుతుంది. అంతేకాకుండా జడ్జెస్ కూడా షాక్ అవుతూ తెగ నవ్వుకున్నారు. దీంతో ఈ వీడియోని చూసి నెటిజన్లు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఓ లేడీ కమెడియన్ ను అలా చేతులతో పట్టుకోవడం ముద్దులు ఇవ్వడం మితిమీరిన హద్దులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Anasuya, Comedian roshini, Extra jabardasth, Jabardasth, Rashmi, Rocking rakesh, Sudigali sudheer

    తదుపరి వార్తలు