అనసూయ వంటలు తిని ఐదుగురు పోయారిక్కడ.. రాకెట్ రాఘవ పంచ్..

Jabardasth Raghava: మూన్నెళ్ళ తర్వాత మళ్లీ మొదలైంది జబర్దస్త్ కామెడీ షో. ఇన్నాళ్లూ పాత స్కిట్స్ చూసి చూసి బోర్ కొట్టిన జనానికి ఫ్రెష్ ఎంటర్‌టైన్మెంట్ అందించారు కమెడియన్లు. వరసగా పంచు డైలాగులతో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 25, 2020, 10:27 PM IST
అనసూయ వంటలు తిని ఐదుగురు పోయారిక్కడ.. రాకెట్ రాఘవ పంచ్..
అనసూయపై అదిరిపోయే పంచ్ వేసిన రాకెట్ రాఘవ (anasuya bharadwaj rocket raghava)
  • Share this:
మూన్నెళ్ళ తర్వాత మళ్లీ మొదలైంది జబర్దస్త్ కామెడీ షో. ఇన్నాళ్లూ పాత స్కిట్స్ చూసి చూసి బోర్ కొట్టిన జనానికి ఫ్రెష్ ఎంటర్‌టైన్మెంట్ అందించారు కమెడియన్లు. వరసగా పంచు డైలాగులతో పిచ్చెక్కించారు.ఈ గ్యాప్‌లో ఏం చేసారు అనే కాన్సెప్టుతోనే చాలా మంది స్కిట్స్ చేసారు కూడా. ముఖ్యంగా కరోనా వైరస్‌తో కూడా కబడ్డి ఆడుకున్నారు. జబర్దస్త్ అలా మొదలైందో లేదో వెంటనే అనసూయపై మళ్లీ పంచుల వర్షం మొదలు పెట్టారు కమెడియన్లు. ఈ క్రమంలోనే రాకెట్ రాఘవ కూడా అదరగొట్టాడు. తన స్కిట్‌లో నవ్వులతో చంపేసాడు ఈ సీనియర్ కమెడియన్. అందులో భాగంగానే అనసూయపై కూడా సెటైర్ల వర్షం కురిపించాడు ఈయన.
జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ (jabardasth new episode)
జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ (jabardasth new episode)

లాక్‌డౌన్ సమయంలో అనసూయ చేసిన వంటలు ప్రయత్నించి ఆ కాలనీలో ఐదుగురు పోయారని నవ్వించాడు ఈయన. లాక్‌డౌన్ ఉన్నపుడు వరసగా వంటలు చేసుకుంటూ.. అందాలు ఆరబోస్తూ వీడియోలు పోస్ట్ చేసింది అనసూయ. దానిపైనే ఇప్పుడు రాకెట్ రాఘవ పంచ్ వేసాడు. మీరు వంటలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని చూసి మా వాళ్లు కూడా ట్రై చేయడం.. అలా చేసి ఐదుగురు పోవడం జరిగిపోయాయి అంటూ సెటైర్లు వేసాడు. దాంతో జడ్జిలు రోజా, మనో పడిపడి నవ్వారు. మరోవైపు తాగుబోతు రమేష్ జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. కొత్త ఎపిసోడ్‌లో కిరాక్ పంచులతో నవ్వించారు కమెడియన్లు.
First published: June 25, 2020, 10:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading