• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • JABARDASTH COMEDIAN ROCKET RAGHAVA CREATED A RECORD WITH CONTINUOUS 400 EPISODES PK

Jabardasth Raghava: రాకెట్ రాఘవ 400 నాటౌట్.. జబర్దస్త్ కట్టప్పకు ఘన సన్మానం..

Jabardasth Raghava: రాకెట్ రాఘవ 400 నాటౌట్.. జబర్దస్త్ కట్టప్పకు ఘన సన్మానం..

జబర్దస్త్ రాఘవ 400 ఎపిసోడ్స్ (jabardasth raghava 400)

Jabardasth Raghava: జబర్దస్త్ కామెడీ షో మొదలు పెట్టి సుమారు ఏడున్నర సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు ఈ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు.. మళ్లీ వచ్చారు.. మళ్లీ వెళ్లారు. స్కిట్‌లు చేసే కంటెస్టెంట్లు, ఆఖరుకు జడ్జిలు కూడా మారారు.

  • Share this:
టెస్ట్ క్రికెట్‌లో లారా అప్పుడెప్పుడో 400 కొట్టాడు.. అది కూడా నాటౌట్‌గా ఉండి. ఇప్పుడు అదే స్కోర్ జబర్దస్త్ కమెడియన్ రాకెట్ రాఘవ కూడా అందుకున్నాడు. ఈయన కూడా ఇప్పుడు 400 నాటౌట్. జబర్దస్త్ కామెడీ షో మొదలు పెట్టి సుమారు ఏడున్నర సంవత్సరాలు అవుతోంది. ఇప్పటి వరకు ఈ కామెడీ షోకి ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు.. మళ్లీ వచ్చారు.. మళ్లీ వెళ్లారు. స్కిట్‌లు చేసే కంటెస్టెంట్లు, ఆఖరుకు జడ్జిలు కూడా మారారు. నాగబాబు, రోజా లాంటి వాళ్లు ఎన్నికల సమయంలో జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత నాగబాబు మొత్తానికే బ్రేక్ ఇచ్చాడు. ఆయన ప్రస్తుతం జీ తెలుగు అదిరిందిలో ఉన్నాడు. మరోవైపు ఆయనతో పాటు చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు కూడా అక్కడే ఉన్నారు. మొదట్లో జబర్దస్త్ చేసిన వేణు, ధన్‌రాజ్ లాంటి కమెడియన్లు కూడా జీ తెలుగులో ఉన్నారు. అలా చాలా మంది మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నారు.. మళ్లీ వచ్చారు. ఈ ఏడున్నరేళ్ల జబర్దస్త్ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు కూడా ఉన్నాయి. అయితే ఇన్నేళ్లలో ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా స్కిట్స్ చేసిన ఒకే ఒక్క కమెడియన్ రాకెట్ రాఘవ.
jabardasth kattappa raghava,Jabardasth Comedian Rocket Raghava,Jabardasth Raghava,Jabardasth Raghava slits,Jabardasth Raghava 400 episodes,Jabardasth Raghava comedy,Jabardasth Raghava 400 episodes,Jabardasth Raghava movies,Jabardasth Raghava record,Jabardasth Raghava roja record,telugu cinema,జబర్దస్త్ రాఘవ,జబర్దస్త్ రాఘవ 400 ఎపిసోడ్స్,జబర్దస్త్ కట్టప్ప
జబర్దస్త్ 400వ ఎపిసోడ్ (jabardasth 400th episode)

మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు జబర్దస్త్‌ షో ప్రారంభించిన మొదటి ఎపిసోడ్ నుంచి తాజగా ప్రసారం అవుతున్న 400 ఎపిసోడ్ వరకు రాకెట్ రాఘవ కనిపిస్తూనే ఉన్నాడు. ఒక్క ఎపిసోడ్ కూడా ఆయన గ్యాప్ తీసుకోలేదు. అంటే ఏడున్నరేళ్లుగా ఈయన జబర్దస్త్ స్టేజీపై స్కిట్స్ చేస్తూనే ఉన్నాడు. అక్కడ ఫేమస్ అయిన చాలా మంది కమెడియన్లు వెండితెరకు వెళ్లారు. అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ తర్వాత వేరే ప్రోగ్రామ్స్‌కి వెళ్లారు. వేరే చోట్ల ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా రాఘవ మాత్రం కరగలేదు.
jabardasth kattappa raghava,Jabardasth Comedian Rocket Raghava,Jabardasth Raghava,Jabardasth Raghava slits,Jabardasth Raghava 400 episodes,Jabardasth Raghava comedy,Jabardasth Raghava 400 episodes,Jabardasth Raghava movies,Jabardasth Raghava record,Jabardasth Raghava roja record,telugu cinema,జబర్దస్త్ రాఘవ,జబర్దస్త్ రాఘవ 400 ఎపిసోడ్స్,జబర్దస్త్ కట్టప్ప
జబర్దస్త్ రాఘవ 400 ఎపిసోడ్స్ (jabardasth raghava 400)

చేతికొచ్చిన అవకాశాలను కూడా కాదనుకున్నాడు. కేవలం జబర్దస్త్ మాత్రమే తన సొంతం అంటున్నాడు రాఘవ. అందుకే ఎక్కడికి వెళట్లేదు ఈయన. అందరి కంటే ఎక్కువగా అటు జబర్దస్త్.. ఇటు సినిమాలు.. మధ్య మధ్యలో ప్రైవేట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ముందుకు సాగుతున్నాడు రాకెట్ రాఘవ. ఈ 400 ఎపిసోడ్స్ నిర్విరామంగా చేసినందుకు గానూ ఈ జబర్దస్త్ కట్టప్పకు ఘన సన్మానం చేసారు. రోజాతో పాటు మిగిలిన వాళ్లంతా కూడా రాఘవకు జై కొట్టేసారు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు