Home /News /movies /

JABARDASTH COMEDIAN RACHA RAVI SPECIAL REQUEST TO TELANGANA CM KCR ON CORONA DEAD BODIES PK

అనాథ శవాల్లా పూడ్చేస్తున్నారు కేసీఆర్ సర్.. జబర్దస్త్ కమెడియన్ రిక్వెస్ట్..

రచ్చ రవి కేసీఆర్ (Racha Ravi KCR)

రచ్చ రవి కేసీఆర్ (Racha Ravi KCR)

Jabardasth comedian Racha Ravi: భారతదేశాన్ని కరోనా వైరస్ ప్రస్తుతం కబలించే పనిలో ఉంది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అన్నిచోట్లా కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది.

భారతదేశాన్ని కరోనా వైరస్ ప్రస్తుతం కబలించే పనిలో ఉంది. చిన్నాపెద్దా అని తేడా లేకుండా అన్నిచోట్లా కూడా కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎవరి జాగ్రత్తలు వాళ్లు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణలోనూ కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కనీసం 1500 కేసులు వస్తున్నాయి. మరోవైపు కరోనాతో చనిపోయిన వాళ్ల కడసారి చూపులకు కూడా బంధువులు నోచుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ విజ్ఞప్తి చేశాడు.
రచ్చ రవి (racha ravi)
రచ్చ రవి (racha ravi)

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు రవి. ఎవరైనా కరోనా బారిన పడి మరణిస్తే అంతకంటే దారుణం మరోటి లేదంటున్నాడు రవి. చనిపోయిన వ్యక్తిని చూడ్డానికి కనీసం అతడి కుటుంబ సభ్యులకు కూడా అనుమతులు లేకుండా పోతున్నాయని వాపోయాడు ఈయన. అతడి కుటుంబీకులు అందరూ ఉన్నప్పటికీ.. కడసారి చూపులకు నోచుకోలేక అనాథ శవంలా వాళ్లను ఖననం చేస్తున్నారని.. అది చనిపోయిన దానికంటే కూడా ఎక్కువ బాధ కలిగిస్తుందని చెప్పాడు రవి.

అందుకే తన రిక్వెస్ట్ ఏంటంటే.. కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్ బాడీని వైరస్ లోపలి నుంచి బయటకు రాకుండా చేసే ఓ స్పెషల్ బాక్సులో పెట్టి కుటుంబీకులకు ఇవ్వాలని కోరుతున్నాడు. అలా చేస్తే వాళ్లు చివరి చూపు చూసుకొని మళ్లీ అప్పజెప్పడమో లేక మన ప్రభుత్వ నిబంధనల మేరకు ఖననం చేయడమో చేస్తారని తెలిపాడు రచ్చ రవి. ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన వంతుగా విజ్ఞప్తి చేసాడు ఈ కమెడియన్ కమ్ నటుడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Racha Ravi, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు