జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందా..?

Jabardasth Comedy Show: నవ్వు వెనక ఏడుపు కూడా ఉంటుందన్నట్లు ఒక్కో నటుడి జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్‌లో ఇలాంటి విషాదమే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2020, 3:43 PM IST
జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందా..?
పంచ్ ప్రసాద్ జబర్దస్త్ (punch prasad jabardasth)
  • Share this:
జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. అయితే నవ్వు వెనక ఏడుపు కూడా ఉంటుందన్నట్లు ఒక్కో నటుడి జీవితంలో ఒక్కో విషాదం కూడా ఉంది. ఇప్పుడు కూడా జబర్దస్త్ కమెడియన్లలో ఒకరి లైఫ్‌లో ఇలాంటి విషాదమే ఉంది. అతడే పంచ్ ప్రసాద్.. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఈయన పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ఈయన.

Jabardasth former judge Nagababu opens sensational facts behind a comedian critical health condition pk జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. nagababu,nagababu jabardasth,jabardasth comedy show,jabardasth comedy skits,extra jabardasth,jabardasth judge nagababu,punch prasad,jabardasth roja,jabardasth comedian punch prasad,extra jabardasth comedy skits,nagababu you tube channel,punch prasad health condition,punch prasad venky monkeys,telugu cinema,punch prasad kidney problems,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షో,జబర్దస్త్ నాగబాబు,పంచ్ ప్రసాద్ అనారోగ్యం,జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యలు,తెలుగు సినిమా
పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కమెడియన్

అప్పట్లో వరసగా కనిపించిన ప్రసాద్.. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు స్క్రీన్ పై కనిపించలేదు. దాంతో జబర్దస్త్ షో మానేసాడేమో అనుకున్నారంతా. కానీ అసలు ఎందుకు మానేసాడో.. ఎందుకు రాలేదో అసలు నిజాలు ఆ మధ్య తన యూ ట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు నాగబాబు. వెంకీ మంకీస్ టీంలో చేస్తున్నపుడే ప్రసాద్ మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ అని అర్థమైందని.. అయితే అంతే ఎమోషనల్ పర్సన్ కూడా అని తర్వాత తెలిసిందని చెప్పాడు నాగబాబు. ఈజీగా కోపం, బీపీ వచ్చేవని.. ఎందుకురా అంటే అసలు కారణం తర్వాత తెలిసిందని చెప్పుకొచ్చాడు నాగబాబు. ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయానని.. దాంతో బతకనేమో సర్ అంటూ తన దగ్గరికి వచ్చి ఏడ్చేవాడని గతాన్ని గుర్తు చేసాడు మెగా బ్రదర్.

Jabardasth former judge Nagababu opens sensational facts behind a comedian critical health condition pk జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్లు లైఫ్ అందుకున్నారు. ఎక్కడ్నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమదైన శైలిలో నవ్వించి సత్తా చూపించారు. చాలామంది కమెడియన్లకు ఈ షో ప్రాణంగా నిలిచింది కూడా. nagababu,nagababu jabardasth,jabardasth comedy show,jabardasth comedy skits,extra jabardasth,jabardasth judge nagababu,punch prasad,jabardasth roja,jabardasth comedian punch prasad,extra jabardasth comedy skits,nagababu you tube channel,punch prasad health condition,punch prasad venky monkeys,telugu cinema,punch prasad kidney problems,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షో,జబర్దస్త్ నాగబాబు,పంచ్ ప్రసాద్ అనారోగ్యం,జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యలు,తెలుగు సినిమా
పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కమెడియన్
అదే సమయంలో తామంతా అతడికి ధైర్యం చెప్పి.. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే తలా కొంత ఇచ్చి సాయం కూడా చేసామని చెప్పాడు ఈయన. అప్పుడు అనివార్య కారణాలతో సర్జరీ జరగలేదు కానీ ప్రస్తుతం డయాలసిస్‌లో ఉన్నాడని షాకింగ్ నిజాలు చెప్పాడు. అయితే ఇదంతా జరిగి కూడా చాలా రోజులు అయిపోయింది. ప్రస్తుతం మళ్లీ జబర్దస్త్ షోలో కనిపిస్తున్నాడు ప్రసాద్. దాంతో పాటు పటాస్ షోలో కూడా నటిస్తున్నాడు. ఇందులో తన అనారోగ్యంపై తానే జోకులు వేసుకుంటాడు ప్రసాద్. ఇప్పటికీ కిడ్నీలు పాడైపోయే ఉన్నాయని చెప్తుంటాడు ఈయన. ప్రసాద్ కామెడీ కోసం చెప్పినా కూడా అదే నిజం అంటున్నారు మిగిలిన కమెడియన్లు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)

ఇప్పటికీ ప్రసాద్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. అయితే త్వరలోనే సర్జరీ చేయించుకుని మళ్లీ మామూలు మనిషి అవుతాడని ఆ మధ్య చెప్పాడు నాగబాబు. ప్రసాద్ పరిస్థితి చూసిన తర్వాతే జబర్దస్త్ కుటుంబం అంతా కలిసి ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవాలనే రూల్ పెట్టానని చెప్పాడు నాగబాబు. అయితే ఈ కమెడియన్ పరిస్థితి ఇలా ఉన్నా కూడా ఒక్కరోజు ఈటీవీ కానీ మల్లెమాల కానీ పలకరించిన పాపాన పోలేదని అప్పట్లో సంచలన నిజాలు బయటపెట్టాడు నాగబాబు. ఏదేమైనా కూడా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం త్వరగా బాగుపడితే అదే చాలంటున్నారు జబర్దస్త్ షో అభిమానులు.
First published: April 3, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు