Home /News /movies /

JABARDASTH COMEDIAN PUNCH PRASAD EMOTIONAL IN SRIDEVI DRAMA COMPANY SHOW SB

మరి కొన్నాళ్లు బతకాలని ఉంది.. అందరినీ కన్నీళ్లు పెట్టించిన జబర్దస్త్ కమెడియన్

పంచ్ ప్రసాద్‌ను ఓదార్చిన సుధీర్

పంచ్ ప్రసాద్‌ను ఓదార్చిన సుధీర్

తనకు ఇంకొన్నాళ్లు బతకాలని ఉందని కంటతడి పెట్టుకున్నాడు జబర్దస్త్ కమెడియన్. దీంతో సుధీర్ అతడ్ని వెంటనే దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. మిగతా వారు కూడా స్టేజ్‌పైకి వచ్చి అతడ్ని ఓదార్చాడు.

  జబర్దస్త్ షో(Jabardasth show) ద్వారా ఎంతోమంది కమెడియన్లు గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ షోకు వచ్చి చాలామంది సినిమాల్లో కూడా అవకాశలు దక్కించుకున్నారు. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అయితే బుల్లితెరపై వచ్చి ఇలా కామెడీ చేసేవాళ్ల నవ్వుల వెనుక.. కష్టాలు కూడా ఉన్నాయి. కొందరు నటులు జనం కోసం నవ్వుతున్నా.. తెరవెనుక ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలా జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో పంచ్ ప్రసాద్(Pucnh Prasad) ఒకరు. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు ఈయన పేరుతో పెద్దగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా వెంకీ మంకీస్ టీంలో తనదైన శైలిలో పంచ్ డైలాగులు వేసి నవ్విస్తుంటాడు ప్రసాద్. అయితే ప్రసాద్ ఆరోగ్యంపై గత కొన్నాళ్లుగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ప్రసాద్ రెండు కిడ్నీలు దాదాపు 80 శాతం పాడైపోయాయి.

  ఇప్పటికీ ప్రసాద్ (Punch prasad)ఆరోగ్యం విషమంగానే ఉందని.. అయితే త్వరలోనే సర్జరీ చేయించుకుని మళ్లీ మామూలు మనిషి అవుతాడని ఆ మధ్య నాగబాబు చెప్పారు. ప్రసాద్ పరిస్థితి చూసిన తర్వాతే జబర్దస్త్ కుటుంబం అంతా కలిసి ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకోవాలనే రూల్ పెట్టానని చెప్పాడు నాగబాబు. కొన్నాళ్ల పాటు జబర్దస్త్ షోలో కనిపించి ప్రసాద్.. తాజాగా తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో(Sridevi Drama company) ప్రత్యక్షమయ్యాడు. అయితే రీసెంట్‌గా విడుదల అయిన ఈ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ నెల 8వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం అందుతోంది.

  ప్రోమోలో ఒక వ్యక్తి తాను పంచ్ ప్రసాద్ అన్నకు పెద్ద ఫ్యాన్ నని చెబుతున్నాడు. ఈ సందర్భంగా ప్రసాద్‌కు ‘మీరు ఒంటరిగా ఉన్న సమయంలో మీ సమస్యను తలచుకుని ఎప్పుడైనా బాధపడ్డారా? ’ అని ఫ్యాన్ పంచ్ ప్రసాద్ ను కిడ్నీ సమస్య గురించి ప్రశ్నించాడు. దానికి ప్రసాద్ సమాధానం ఇస్తూ...పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ తాను ఏరోజు బాధ పడలేదని ఒంటరిగా ఉన్న సమయంలో కూడా తాను ఎక్కువగా ఆలోచించలేదని కామెంట్లు చేశారు. అయితే ...‘నిజంగా మీకు అవసరం అయితే కిడ్నీ ఇవ్వడానికి కూడా తాను సిద్ధమేనని ఆ అభిమాని చెప్పాడు’దీంతో అభిమాని కామెంట్లు విన్న తర్వాత ఇప్పుడు ఫీలవుతున్నానని పంచ్ ప్రసాద్ తెలిపారు.
  నాకు కూడా ఏడ్చేంత అభిమానులు ఉన్నారా? అని అనిపించిందని పంచ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. దేవుడ్ని ఇంకొన్నాళ్లు జనాన్ని నవ్వించే లైఫ్ స్పాన్ ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో సుధీర్ ప్రసాద్‌ను దగ్గరకు తీసుకొని హత్తుకున్నాడు. ఈ సీన్‌తో ఆ షోకు వచ్చిన వాళ్లంతా కంటతడి పెట్టుకున్నారు.

  పంచ్ ప్రసాద్ తర్వాత పరదేశి తల్లి కూడా ఏడుస్తూ స్టేజ్‌పైకి వస్తోంది. తన తల్లి ఇలా ఏడవటానికి గల కారణాన్ని ప్రోమోలో చూపించలేదు.హైపర్ ఆదికి సైతం పవన్ కళ్యాణ్ పై ఉండే అభిమానం వల్ల అవకాశాలు తగ్గుతున్నాయా? అనే ప్రశ్న ఎదురైంది.సుడిగాలి సుధీర్ కు ఢీ షో మానేయడానికి గల కారణం చెప్పాలని ప్రశ్న ఎదురైంది.ఇలా వరుసగా నటులందరికీ అభిమానులు షాకింగ్ ప్రశ్నలు వేశారు. దీంతో వాళ్లు ఈ ప్రశ్నలకు ఏ సమాధానం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Jabardast, Jabardast comedian, Sridevi Drama Company Latest Promo

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు