జబర్ధస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రవీణ్ తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. గత కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ప్రవీణ్ తండ్రి మంగళవారం కన్నుమూశారు. ప్రవీణ్ తండ్రి గతకొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ.. ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తున్న దశలోనే అతడి కాళ్లు, చేతులు విపరీతంగా వాయడంతో పాటు ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఇక ఇదే చివరి స్టేజ్ అని వైద్యులు చెప్పకనే చెప్పేశారు.
దీంతో తండ్రిని బతికించుకునేందుకు ప్రవీణ్ చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అయ్యాయి. చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయిన ప్రవీణ్.. ఇప్పుడు తండ్రి కూడా దూరం కావడంతో... తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తన తల్లి చిన్నప్పుడే చనిపోయినా తన తండ్రి మాత్రం ఇద్దరు కొడుకులను పెంచి పెద్ద చేశారు. తమను బాగా చదివించుకుంటూ తన జీవితాన్నే త్యాగం చేశాడంటూ గతంలో ప్రవీణ్ చెప్పిన విషయం తెలిసిందే. పటాస్ కామెడి షోలో పంచ్‌లు, ప్రాసలతో కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ప్రవీణ్‌కి జబర్ధస్త్ షో ద్వారా మరింత గుర్తింపు లభించింది. ప్రస్తుతం ప్రవీణ్ ఇంట జరిగిన విషాదంతో జబర్దస్త్ టీం కూడా ప్రవీణ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.