Jabardasth: అమ్మ రాజశేఖర్ నన్ను వాడుకుని వదిలేసాడంటున్న జబర్దస్త్ కమెడియన్..

Jabardasth Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ అంటే ఇది వరకు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి పరిచయం అయ్యాడు ఈయన. కొరియోగ్రఫర్‌గా వచ్చి దర్శకుడిగా మారి అప్పట్లో సంచలనాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 6:03 PM IST
Jabardasth: అమ్మ రాజశేఖర్ నన్ను వాడుకుని వదిలేసాడంటున్న జబర్దస్త్ కమెడియన్..
జబర్దస్త్ కామెడీ షో లోగో (jabardasth comedy show)
  • Share this:
అమ్మ రాజశేఖర్ అంటే ఇది వరకు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని చాలా మందికి పరిచయం అయ్యాడు ఈయన. కొరియోగ్రఫర్‌గా వచ్చి దర్శకుడిగా మారి అప్పట్లో సంచలనాలు సృష్టించాడు రాజశేఖర్. ఆ తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయిపోయి ఇప్పుడు బిగ్ బాస్‌తో మళ్లీ పాపులర్ అవుతున్నాడు. ఈయనపై ఒకప్పుడు జబర్దస్త్ కమెడియన్ ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి వచ్చారు.. వస్తున్నారు. కమెడియన్లు మాత్రమే కాదు టెక్నీషియన్స్‌ను కూడా ఇండస్ట్రీకి అందిస్తుంది ఈ షో. అలాగే ఈ షోలో ప్రస్తుతం స్టార్ ఇమేజ్ అనుభవిస్తున్న చాలా మంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడ్డ వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ కథ మరోటి కూడా వెలుగులోకి వచ్చిందిప్పుడు. ఆయనెవరో కాదు జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేస్తూ పాపులర్ అయిన పవన్. షోలో ఇతన్నీ పావని అంటుంటారు టీం లీడర్స్. జబర్దస్త్‌తో పాటు ఢీలో కూడా పవన్ పాల్గొన్నాడు.

జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)


అక్కడ కూడా డాన్సర్‌గా పని చేసాడు. అంతేకాదు దానికంటే ముందు జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు పవన్. అయితే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటికి చెప్పుకున్నాడు. ఒకప్పుడు తాను కనీసం పూట గడవని స్థితిలో ఉన్నానని.. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకొచ్చాడు పవన్. హైదరాబాద్ పొట్ట చేత పట్టుకుని వచ్చినపుడు దిల్‌సుఖ్‌నగర్‌లో చిన్న రూమ్ తీసుకుని ఉన్నానని.. అలాంటి సమయంలోనే సాయిబాబా గుడి దగ్గర పెట్టే ప్రసాదం కోసం కూడా ఎదురు చూసే వాన్ని అని చెప్పుకున్నాడు పవన్. అలాంటి సమయంలోనే లేడీ గెటప్స్ వేస్తూ డబ్బులు సంపాదించుకున్నానని.. ఆ సమయంలోనే తనకు అమ్మ రాజశేఖర్ పరిచయం అయ్యాడని.. ఆయన దగ్గర డాన్స్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)


అప్పుడు తనకు అన్ని పనులు చేసి పెట్టానని.. బట్టలు ఉతకడంతో పాటు అంట్లు తోమానని.. ఇంట్లో బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసానని చెప్పుకొచ్చాడు ఈయన. అవన్నీ అవకాశాల కోసమే చేసానని.. కానీ ఖతర్నాక్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని.. ఆ తర్వాత టక్కరిలో కూడా ఛాన్స్ ఇస్తాడేమో అనుకుంటే మోసం చేసాడని చెప్పాడు పవన్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ వెక్కిరించాడని.. అప్పుడే ఆయన దగ్గర్నుంచి బయటికి వచ్చేసానని చెప్పాడు పవన్. అలా జీవితం గడుస్తున్న సమయంలోనే జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందని తెలిపాడు ఈయన. మొత్తానికి అమ్మ రాజశేఖర్‌పై పవన్ ఈ కామెంట్స్ చేసి చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పుడు ఈయన బిగ్ బాస్‌లో ఉన్నాడు కాబట్టి బాగా వైరల్ అవుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading