జబర్దస్త్ కమెడియన్‌ను మోసం చేసిన ఆ దర్శకుడు.. పెళ్లాంలా వాడుకుని..

Jabardasth Comedy Show: జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి వచ్చారు.. వస్తున్నారు. కమెడియన్లు మాత్రమే కాదు టెక్నీషియన్స్‌ను కూడా ఇండస్ట్రీకి అందిస్తుంది ఈ షో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 1, 2020, 3:48 PM IST
జబర్దస్త్ కమెడియన్‌ను మోసం చేసిన ఆ దర్శకుడు.. పెళ్లాంలా వాడుకుని..
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి వచ్చారు.. వస్తున్నారు. కమెడియన్లు మాత్రమే కాదు టెక్నీషియన్స్‌ను కూడా ఇండస్ట్రీకి అందిస్తుంది ఈ షో. అలాగే ఈ షోలో ప్రస్తుతం స్టార్ ఇమేజ్ అనుభవిస్తున్న చాలా మంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడ్డ వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ కథ మరోటి కూడా వెలుగులోకి వచ్చిందిప్పుడు. ఆయనెవరో కాదు జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేస్తూ పాపులర్ అయిన పవన్.

జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)


షోలో ఇతన్నీ పావని అంటుంటారు టీం లీడర్స్. జబర్దస్త్‌తో పాటు ఢీలో కూడా పవన్ పాల్గొన్నాడు. అక్కడ కూడా డాన్సర్‌గా పని చేసాడు. అంతేకాదు దానికంటే ముందు జబర్దస్త్ షోతో పాపులర్ అయ్యాడు పవన్. అయితే ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటికి చెప్పుకున్నాడు. ఒకప్పుడు తాను కనీసం పూట గడవని స్థితిలో ఉన్నానని.. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇలా ఉన్నానని చెప్పుకొచ్చాడు పవన్.

జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)


హైదరాబాద్ పొట్ట చేత పట్టుకుని వచ్చినపుడు దిల్‌సుఖ్‌నగర్‌లో చిన్న రూమ్ తీసుకుని ఉన్నానని.. అలాంటి సమయంలోనే సాయిబాబా గుడి దగ్గర పెట్టే ప్రసాదం కోసం కూడా ఎదురు చూసే వాన్ని అని చెప్పుకున్నాడు పవన్. అలాంటి సమయంలోనే లేడీ గెటప్స్ వేస్తూ డబ్బులు సంపాదించుకున్నానని.. ఆ సమయంలోనే తనకు అమ్మ రాజశేఖర్ పరిచయం అయ్యాడని.. ఆయన దగ్గర డాన్స్ అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)


అప్పుడు తనకు అన్ని పనులు చేసి పెట్టానని.. బట్టలు ఉతకడంతో పాటు అంట్లు తోమానని.. ఇంట్లో బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసానని చెప్పుకొచ్చాడు ఈయన. అవన్నీ అవకాశాల కోసమే చేసానని.. కానీ ఖతర్నాక్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని.. ఆ తర్వాత టక్కరిలో కూడా ఛాన్స్ ఇస్తాడేమో అనుకుంటే మోసం చేసాడని చెప్పాడు పవన్.
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)
జబర్దస్త్ పవన్ అమ్మ రాజశేఖర్ (pawan amma rajasekhar)


నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ వెక్కిరించాడని.. అప్పుడే ఆయన దగ్గర్నుంచి బయటికి వచ్చేసానని చెప్పాడు పవన్. అలా జీవితం గడుస్తున్న సమయంలోనే జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందని తెలిపాడు ఈయన. మొత్తానికి అమ్మ రాజశేఖర్‌పై పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: August 1, 2020, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading