JABARDASTH COMEDIAN NOOKARAJU QUITS GOVERNMENT JOB FOR PATAS AND OTHER COMEDY SHOWS PK 2
Jabardasth Comedy Show: జబర్దస్త్ షో కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చిన కమెడియన్..
పటాస్ నూకరాజు (Patas Nookaraju)
Jabardasth Comedy Show: గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాసి పెట్టి ఉండాల్రా అంటూ పెద్దలు సామెత కూడా చెప్తుంటారు. అలాంటి జాబ్ వస్తే వదిలేసుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..? కానీ తనకు నచ్చిన రంగంలో రాణించడం కోసం ఓ కమెడియన్ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చాడు.
గవర్నమెంట్ జాబ్ కోసం తపస్సులు చేస్తుంటారు.. ఏళ్ల తరబడి పూజలు చేస్తుంటారు.. అలాగే నెలల తరబడి పుస్తకాల పురుగులా మారిపోతుంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే క్రేజ్.. మోజు అలా ఉంటుంది మరి. అయినా గవర్నమెంట్ సొమ్ము తినాలంటే రాసి పెట్టి ఉండాల్రా అంటూ పెద్దలు సామెత కూడా చెప్తుంటారు. అంతగా ఈ జాబ్ కోసం కష్టపడుతుంటారంతా. అలాంటి జాబ్ వస్తే వదిలేసుకునే వాళ్లు ఎవరైనా ఉంటారా..? అసలు అలా జరుగుతుందా..? కానీ ఇలా చేసే వాళ్లు కూడా కొందరు ఉంటారు. తనకు నచ్చిన రంగంలో రాణించడం కోసం ఓ జబర్దస్త్ కమెడియన్ ఏకంగా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలేసి వచ్చాడు. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నటుడిగా ఎదగాలనే ఆశతో చేస్తున్న గవర్నమెంట్ జాబ్‌కు రిజైన్ చేసాడు. ఆ కమెడియన్ మరెవరో కాదు నూకరాజు. ఒకప్పుడు రవి, శ్రీముఖి జంటగా వచ్చిన పటాస్ షో చూసే వాళ్లకు నూకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కడ చిన్న పిల్లలతో కలిసి అదిరిపోయే కామెడీ చేసాడు నూకరాజు. ఆ తర్వాత జీ తెలుగులో కూడా కొన్ని ఎపిసోడ్స్ చేసాడు.
ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో జిగేల్ జీవన్ టీంలో చేస్తున్నాడు ఈ కుర్రాడు. చూడ్డానికి అలా ఉంటాడు కానీ మనోడి బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం షాక్ అయిపోవాల్సిందే. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవాడివి అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు పేలిపోయే సమాధానమిచ్చాడు నూకరాజు.
పటాస్ నూకరాజు (Patas Nookaraju)
ఇక్కడికి రాకముందు విజయవాడలో ఉద్యోగం చేసేవాన్ని అంటూ చెప్పుకొచ్చాడు. ఏం జాబ్ అంటే.. గవర్నమెంట్ జాబ్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. విజయవాడ పవర్ ప్లాంట్‌లో చేస్తున్న పర్మినెంట్ జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చాడు ఈ కుర్రాడు. ముందు ఇది తెలిసిన తర్వాత అంతా ఆయన్ని తిట్టారు కూడా. అయితే తన ప్యాషన్ కోసం గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేసేంత యిష్టం ఉందని చెప్పుకొచ్చాడు నూకరాజు.
పైగా ప్రస్తుతం కమిటైన షోల కోసం డేట్స్ కూడా అడ్జస్ట్ చేయడం కష్టంగా మారడంతో జాబ్‌కు రాజీనామా చేసినట్లు చెప్పాడు నూకరాజు. ఏదేమైనా కూడా ఈ రోజుల్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్లు లక్షల్లో ఉన్నారు. అలాంటిది నచ్చిన రంగం కోసం వచ్చిన జాబ్ వదిలేసి రావడం నిజంగా గొప్ప విషయమే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.