హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్ నవీన్ అసలు వయసు తెలిస్తే షాక్ తప్పదు..

జబర్దస్త్ నవీన్ అసలు వయసు తెలిస్తే షాక్ తప్పదు..

జబర్దస్త్ కమెడియన్ నవీన్ (jabardasth naveen)

జబర్దస్త్ కమెడియన్ నవీన్ (jabardasth naveen)

Jabardasth Naveen: జబర్దస్త్ నవీన్.. గడ్డం నవీన్.. ఇలా రెండు పేర్లతో కూడా పాపులర్ అయ్యాడు నవీన్. జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు.

జబర్దస్త్ నవీన్.. గడ్డం నవీన్.. ఇలా రెండు పేర్లతో కూడా పాపులర్ అయ్యాడు నవీన్. జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు. ముఖ్యంగా అదిరే అభి స్కిట్స్‌లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అందులో అభి, రాముతో పాటు ఈయన కూడా మంచి కామెడీ చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా జూనియర్ రాఘవేంద్రరావుగా మనోడికి మంచి పేరుంది. దాంతో పాటు సినిమాలు కూడా బాగానే చేస్తున్నాడు నవీన్. ప్రస్తుతానికి ఈయన కెరీర్ బాగానే వెళ్తుంది.

జబర్దస్త్ కమెడియన్ నవీన్ (jabardasth naveen)
జబర్దస్త్ కమెడియన్ నవీన్ (jabardasth naveen)

ఈయన వాటం.. తెల్లగడ్డం చూసిన తర్వాత వయసు చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎప్పుడో 30 ఏళ్ల కిందే ఇండస్ట్రీకి వచ్చుంటాడు.. వయసు కూడా 60కి చేరువలో ఉంటుంది అనుకుంటారు. కానీ జబర్దస్త్ నవీన్ వయసు తెలిస్తే మాత్రం నిజంగానే షాక్ అవుతారు. మనోడు కనీసం 45 కూడా దాటలేదంటే నమ్మడం కాస్త కష్టమే. 2020కి నవీన్ వయసు 43 మాత్రమే. కానీ లుక్ చూస్తుంటే మాత్రం 60లా అనిపిస్తుంటాడు. 1997లో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించాడు.

jabardasth comedy show,jabardasth show,jabardasth adire abhi,jabardasth naveen,tollywood news,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో, అదిరే అభి, తెలుగు న్యూస్, టాలీవుడ్ న్యూస్
జబర్దస్త్ నవీన్ (Image: Youtube/volga)

అప్పట్లో ఫుల్ జుట్టుతో.. సూపర్ హెయిర్ స్టైల్‌తో నిజంగానే హీరోలా ఉన్నాడు నవీన్. ఆ లుక్ ఉన్నపుడు ఈయన్ని ఎవరూ పెద్దగా గుర్తు పట్టలేదు. కానీ చాలా తక్కువ సమయంలోనే ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయానని కామెడీగా చెబుతున్నాడు నవీన్. జుట్టు పోయింది.. అవకాశాలు రావడం లేదనే బాధతో గడ్డం పెంచానని.. అప్పుడు అవకాశాలు రావడం మొదలుపెట్టాయని చెప్పుకొచ్చాడు ఈయన.

జబర్దస్త్ కమెడియన్ నవీన్ (jabardasth naveen)
జబర్దస్త్ కమెడియన్ నవీన్ (jabardasth naveen)

తన తెల్లగడ్డం చూసి అందరూ రిటైర్మెంట్ వయసుకు వచ్చేసాడని అనుకుంటున్నారని.. కనీసం తనకు 45 కూడా లేవని చెప్పుకొచ్చాడు ఈయన. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో నటించానని.. ఆది, నాగ లాంటి సినిమాల్లో చేసానని గుర్తు చేసుకున్నాడు. తాతలా కనిపించే నవీన్ వయసు కేవలం 43 మాత్రమే అంటే షాక్ తప్పదేమో మరి..? కానీ ఏం చేస్తాం అదే నిజం మరి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు