జబర్దస్త్ నరేష్‌లో అరుదైన టాలెంట్ గురించి మీకు తెలుసా..?

Jabardasth Naresh: జ‌బ‌ర్ద‌స్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్. చూడ్డానికి మిర‌ప‌కాయ్‌లా ఉన్నా కూడా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 24, 2020, 7:13 PM IST
జబర్దస్త్ నరేష్‌లో అరుదైన టాలెంట్ గురించి మీకు తెలుసా..?
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
  • Share this:
జ‌బ‌ర్ద‌స్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్. చూడ్డానికి మిర‌ప‌కాయ్‌లా ఉన్నా కూడా ఆయ‌న కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు ఈ కుర్రాడు. మూడడుగులే ఉంటాడు కానీ మిగిలిన టీం లీడర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంటాడు తన టైమింగ్‌తో. అలాంటి నాటి నరేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి చూపించే నరేష్.. ఈటీవీలో ఢి షోకు ఎంపికయ్యాడు. అక్కడ్నుంచి ఈ కుర్రాడి ప్రయాణం మొదలైంది.
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)


వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్.. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. కానీ అదే అతడికి వరమైంది కూడా. పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తుంటాడు కానీ నరేష్ వయసు మాత్రం 20 ఏళ్లు. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్.. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు. ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చిన తర్వాత నరేష్ జాతకం మారిపోయింది. అక్కడే అతడు స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా తనదైన పంచులతో పిచ్చెక్కించాడు నరేష్.
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)

జబర్దస్త్ కోసం అంతా స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.. కానీ నరేష్ మాత్రం చేయడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఏంటి.. స్కిట్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే గుర్తు పెట్టుకుని స్టేజ్‌పైనే పర్ఫార్మ్ చేస్తుంటాడు నరేష్. ఇది నిజంగాను అరుదైన టాలెంట్ అంటూ భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పాడు. నరేష్ వల్లే తమ టీంకు అంతమంచి పేరొచ్చిందని చెప్తుంటాడు ఆయన. ఒక్క టీం అనకుండా అందరి టీంలలో కనిపిస్తుంటాడు నరేష్. జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత సొంతూళ్లో ఇల్లు కూడా కట్టుకున్నాడు ఈయన. సిటీలో కూడా ఫ్లాట్ తీసుకున్నాడు. మొత్తానికి బుడ్డోడిలా కనిపిస్తాడు కానీ బుల్డోజర్ మాదిరి పంచ్ డైలాగులు పేలుస్తూ నవ్విస్తున్నాడు నరేష్.
First published: April 24, 2020, 7:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading