‘జబర్దస్త్ కామెడీ షో’ నుంచి ఎంతోమంది ఆణిముత్యాల్లాంటి నటులు బయటికి వచ్చారు. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అందులో నాటీ నరేష్ కూడా ఒకడు. చూడ్డానికి సీమ టపాకాయ్‌లా మూడు అడుగులే ఉంటాడు కానీ మనోడు పేల్చే డైలాగులు మాత్రం నాటు బాంబుల్లా ఉంటాయి. జబర్దస్త్‌లో ఈ బుడ్డోడికి మంచి ఇమేజ్ ఉంది. 20 ఏళ్ల ఈ కుర్రాడు చూడ్డానికి మాత్రం ఐదేళ్ల పిల్లాడిలా ఉంటాడు. జన్యులోపంతో అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఆ ఎదగకుండా ఉన్న లోపలే డబ్బులు సంపాదించి పెడుతుంది అంటున్నాడు నరేష్. ప్రస్తుతం నరేష్ కెరీర్ మంచి దూకుడు మీదుంది. వరస ఈవెంట్స్ చేస్తూ.. షోలు చేసుకుంటూ.. జబర్దస్త్ చేస్తూ బిజీగా ఉన్నాడు. రెండు చేతులా సంపాదించుకుంటున్నాడు. ఇంటిని చూసుకుంటున్నాడు. అయితే ఎంత హ్యాపీగా ఉన్నా కూడా లైఫ్‌లో కొన్ని చేదు నిజాలు మాత్రం అలాగే గుర్తుండిపోతాయి. నరేష్ జీవితంలో కూడా అలాంటిదే ఉంది. ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు నాటీ నరేష్. తన జీవితంలో తొలిసారి అమెరికా ఈవెంట్‌కు వెళ్లే క్రమంలో జరిగిన ఓ విషాద సంఘటన గురించి చెప్పుకొచ్చాడు నరేష్. అమెరికా ఈవెంట్‌కు వెళ్లే ముందు తన తాతయ్య చనిపోయాడని.. ఆ సమయంలో అంత్యక్రియల కోసం కనీసం చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో బుల్లెట్ భాస్కర్‌ను అప్పు అడిగానని చెప్పాడు.

జబర్దస్త్ నరేష్ బుల్లెట్ భాస్కర్ (Jabardasth Naresh, Bullet Bhasker)
అమెరికా ఈవెంట్‌కు వెళ్లొచ్చిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేసానంటున్నాడు ఈయన. కరోనా టైమ్‌లో ఓ యూ ట్యూబ్ ఛానెల్‌తో కలిసి తన ‘హోం టూర్’ వీడియో చేశాడు నరేష్. అందులో భాగంగానే తన ఇంట్లో ఉన్న సామాన్లతో పాటు తనకు నటనలో వచ్చిన ట్రోపీలను కూడా చూపించాడు. నటుడికి డబ్బుల కంటే కూడా ప్రోత్సాహకంగా వచ్చే ఈ ట్రోఫీలే ఎక్కువ ఆనందాన్నిస్తాయంటున్నాడు. ఏదేమైనా కూడా తాత చనిపోయినపుడు చేతిలో డబ్బులు లేకపోవడం.. ఆ సమయంలో భాస్కర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనంటున్నాడు నాటీ నరేష్.
Published by:Praveen Kumar Vadla
First published:January 16, 2021, 16:39 IST