JABARDASTH COMEDIAN NARESH REAL AGE REVEALED AND HIS PERSONAL DETAILS HERE PK
Jabardasth Naresh: జబర్దస్త్ బుడ్డోడు నరేష్ వయసు అంత ఉందా.. చిన్న పిల్లోడిగా ఉంటాడే..?
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
Jabardasth Naresh: చూడ్డానికి మూడడుగులు కూడా ఉండడు.. కానీ పంచులు పేలిస్తే మాత్రం పొట్ట చెక్కలు కావాల్సిందే. అంతగా జబర్దస్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్.
చూడ్డానికి మూడడుగులు కూడా ఉండడు.. కానీ పంచులు పేలిస్తే మాత్రం పొట్ట చెక్కలు కావాల్సిందే. అంతగా జబర్దస్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న కుర్ర కమెడియన్ నరేష్ ఉరఫ్ నాటి నరేష్. చూడ్డానికి మిరపకాయ్‌లా ఉన్నా కూడా ఆయన కామెడీ మాత్రం చాలా ఘాటుగా ఉంటుంది. తనదైన పంచులతో పిచ్చెక్కిస్తుంటాడు ఈ కుర్రాడు. మూడడుగులే ఉంటాడు కానీ మిగిలిన టీం లీడర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తుంటాడు తన టైమింగ్‌తో. అలాంటి నాటి నరేష్ వయసు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. మనోడి వయసెంత అనేది చాలా మందికి తెలియదు. చూడ్డానికి జూనియర్లా ఉంటాడు.. కానీ ఓటు హక్కు కూడా వచ్చేసింది. అంత సీనియర్ ఈ చిట్టి మిరపకాయ్. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్.. చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. కానీ అదే అతడికి వరమైంది కూడా. పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తుంటాడు కానీ నరేష్ వయసు మాత్రం 20 ఏళ్లు అంటే నమ్మడం కాస్త కష్టమే. 2000 సంవత్సరంలో పుట్టిన నరేష్.. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయటే తిరుగుతుంటే సునామీ సుధాకర్ చూసి చంటి టీంలో జాయిన్ చేసాడు.
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చిన తర్వాత నరేష్ జాతకం మారిపోయింది. అక్కడే అతడు స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా తనదైన పంచులతో పిచ్చెక్కించాడు నరేష్. జబర్దస్త్ కోసం అంతా స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.. కానీ నరేష్ మాత్రం చేయడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఏంటి.. స్కిట్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే గుర్తు పెట్టుకుని స్టేజ్‌పైనే పర్ఫార్మ్ చేస్తుంటాడు నరేష్. ఇది నిజంగానే అరుదైన టాలెంట్ అంటూ భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పాడు. నరేష్ వల్లే తమ టీంకు అంతమంచి పేరొచ్చిందని చెప్తుంటాడు ఆయన.
జబర్దస్త్ నరేష్ (jabardasth naresh)
ఒక్క టీం అనకుండా అందరి టీంలలో కనిపిస్తుంటాడు నరేష్. జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత సొంతూళ్లో ఇల్లు కూడా కట్టుకున్నాడు ఈయన. సిటీలో కూడా ఫ్లాట్ తీసుకున్నాడు. మొత్తానికి బుడ్డోడిలా కనిపిస్తాడు కానీ బుల్డోజర్ మాదిరి పంచ్ డైలాగులు పేలుస్తూ నవ్విస్తున్నాడు నరేష్. ఇప్పుడు కూడా ఈ బుడ్డోడు కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా అన్ని ఛానెల్స్ తిరుగుతున్నాడు. ఉదయభానుతో మొదలు పెట్టిన గ్యాంగ్ లీడర్ షో కూడా చేసాడు. దాంతో పాటే మరిన్ని రియాలిటీ షోలు కూడా చేస్తున్నాడు నరేష్. ఏదేమైనా కూడా చిన్ననాటి నుంచే సెలబ్రిటీ అయిపోయాడు ఈ కుర్రాడు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.