హోమ్ /వార్తలు /సినిమా /

రోజా ముందే అసెంబ్లీ స్కిట్‌తో సెటైర్ వేసిన జబర్ధస్త్ కమెడియన్.. ఫీలైన ఎమ్మెల్యే..

రోజా ముందే అసెంబ్లీ స్కిట్‌తో సెటైర్ వేసిన జబర్ధస్త్ కమెడియన్.. ఫీలైన ఎమ్మెల్యే..

రోజా (Roja )

రోజా (Roja )

సినిమాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీరోల్ పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. తాజాగా రోజా ముందే..

సినిమాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లో కీరోల్ పోషిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగతున్న ఆమె స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ జడ్జ్‌గా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేగా.. ఏపీఐఐసీ చైర్మన్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది.అటువంటి ఐరన్ లేడీ రోజా ఉంటే అవతల ఎంతటి వాళ్లకైనా హడల్. అలాంటిది రోజాకే ఒక పిల్లవాడు ఎదురు తిరుగుతూ పంచ్ డైలాగులు చెబితే ఎలావుంటుంది ... చూడాలనివుందా ... అయితే ... ప్రతీ పండగకి స్మాల్ స్క్రీన్ పై  అదిరిపోయే ఈవెంట్ తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఈటీవీ ఈ సంక్రాంతికి కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్‌ను రూపొందించింది.‘అమ్మా నాన్న ఓ సంక్రాంతి' అనే ఈ స్పెషల్ ఎపిసోడ్ లో లో రోజా, సుధీర్, అనసూయ, హైపర్ అది సహా ఎంతో మంది ఆర్టిస్టులు కనువిందుచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఈ ప్రోగ్రాంలో రోజా అదిరిపోయే స్పెప్పులతో అలరించారు. అయితే సుడిగాలి సుధీర్ గర్ల్ ఫ్రెండ్స్ గురించిన లెక్కల వివరాలను గంగిరెద్దు చెప్పడం, హైపర్ ఆది పిల్లలను కిడ్నాప్ చెయ్యడం వంటి కొంటె సంఘటనలతో ఈ ప్రోమో‌స్‌ మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.

రోజా (Youtube/Photo)

తాజాగా విడుదలైన ప్రోమోలో ఇదొక్కటేనా కళ్ళు పెద్దవి చేసి చూస్తే..అంటూ రోజాకే చైల్డ్ ఆర్టిస్ట్ నరేష్ పంచ్ డైలాగ్స్ వేసాడు.ఈ స్కిట్ మాత్రం అదిరిపోయే రేంజ్‌లో ఆడియన్స్ ముందుక రాబోతుంది. యమ ధర్మ రాజుగా గెటప్ శ్రీను చేసిన అత్యద్భుతమైన పర్ఫామెన్స్  ఈ ఈవెంట్ ను మరో స్థాయికి తీసుకెళ్లడం గ్యారంటీ అని చెప్పవచ్చు.మరో విషయం ఏంటంటే రోజా కుమారుడు కూడా ఈ షోలో పంచ్ డైలాగ్స్ తో కనువిందు చేయనున్నాడు. యాంకర్ ప్రదీప్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగరోజు ఉదయం 9 గంటలకు ప్రసారం కానుంది.

First published:

Tags: Hyper Aadi, Jabardasth comedy show, MLA Roja, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు