Mukku Avinash: వీడియో కాల్‌లో కాబోయే భార్య.. పక్కనే అరియానా.. ఇంట్లో వినాయక చవితి సంబరాలు..

Mukku Avinash Photo : Instagram

Mukku Avinash: బయటికి వచ్చిన తర్వాత మళ్లీ జబర్దస్త్‌కు (Jabardasth Comedy Show) నో ఎంట్రీ బోర్డ్ ఉండటంతో మా టీవీలోనే సెటిల్ అయిపోయాడు అవినాష్. అక్కడే ప్రస్తుతం వరసగా షోలు చేస్తున్నాడు. తాజాగా ఈయన పోస్ట్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

  • Share this:
జబర్దస్త్ కామెడీ షోతో (Jabardasth Comedy Show) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ అవినాష్ (Mukku Avinash). అతన్నే అభిమానులు ముద్దుగా ముక్కు అవినాష్ అని పిలుస్తుంటారు. అందుకే తన యూ ట్యూబ్ ఛానెల్‌కు కూడా అదే పేరు పెట్టుకున్నాడు అవినాష్. గతేడాది బిగ్ బాస్ షోకు (Bigg Boss 5 Telugu) వెళ్లి.. అక్కడ దాదాపు 80 రోజులకు పైగానే ఉన్నాడు. చాలా రోజుల పాటు అక్కడే ఉండి.. తన ఒరిజినాలిటీని చూపించే ప్రయత్నం చేసాడు ఈ కమెడియన్. బయటికి వచ్చిన తర్వాత మళ్లీ జబర్దస్త్‌కు నో ఎంట్రీ బోర్డ్ ఉండటంతో మా టీవీలోనే సెటిల్ అయిపోయాడు అవినాష్. అక్కడే ప్రస్తుతం వరసగా షోలు చేస్తున్నాడు. దాంతో పాటు మధ్యలో జీ తెలుగుకు కూడా వెళ్ళొచ్చాడు. ఇవన్నీ ఇలా ఉంటే.. త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు అవినాష్. ఇప్పటికే ఈయన ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ఆ వీడియో యూ ట్యూబ్‌లో వైరల్ అయింది కూడా. మూడు రోజుల్లోనే 3 మిలియన్ వ్యూస్ అందుకుంది.

ట్రెండింగ్‌లోనూ నిలిచింది అవినాష్ నిశ్చితార్థ వీడియో. ఇప్పుడు మరో వీడియోను విడుదల చేసాడు అవినాష్. వినాయక చవితి పూజలు చేసుకుంటున్న వీడియో అది. కుటుంబ సభ్యులతో కలిసి గణేష్ చతుర్ధి సంబరాలు చేసుకున్నాడు అవినాష్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుందిప్పుడు. ఇక్కడే మరో విశేషం కూడా ఉంది. అవినాష్ ఇంటికి అరియానా వచ్చింది. గతేడాది బిగ్ బాస్ హౌజ్‌లో ఈ ఇద్దర మధ్య ఏం జరిగిందో రెండు తెలుగు రాష్ట్రాలు చూసాయి.



పెళ్లి చేసుకుంటారేమో అనేంతగా ఈ ఇద్దరి మధ్య బంధం పెరిగిపోయింది. బయటికి వచ్చిన తర్వాత కూడా టీవీ షోలలో ఒకరి కోసమే మరొకరు అన్నట్లున్నారు. సరిగ్గా అదే సమయంలో తన పెళ్లి అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు అవినాష్. తాజాగా వినాయక చవితి సంబరాలలో అరియానా ఇంట్లోనే ఉంటే.. కాబోయే భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడాడు అవినాష్. తన ఇంట్లో జరుగుతున్న వేడుకలను కాబోయే భార్యకు చూపించాడు ఈయన. అరియానను కూడా పరిచయం చేయడమే కాకుండా ఇద్దరూ కలిసి కామెడీ కూడా చేసారు. త్వరలోనే వీళ్ళ పెళ్లి జరగనుంది. ముక్కు అవినాష్ పెళ్లి తేదీపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.
Published by:Praveen Kumar Vadla
First published: