JABARDASTH COMEDIAN MUKKU AVINASH RECEIVED FINANCIAL HELP FROM CM RELIEF FUND FOR HIS MOTHER MEDICAL TREATMENT SK
Mukku Avinash: కష్టాల్లో జబర్దస్త్ కమెడియన్ అవినాష్.. ఆదుకున్న తెలంగాణ సర్కార్..
కమెడియన్ ముక్కు అవినాష్ (ఫైల్ ఫొటో)
ముక్కు అవినాష్‌కు సీఎం రిలీఫ్ నిధులు మంజూరు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీఎం సహాయ నిధికి నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేస్తే కనీస సాయం చేయడంలేదని.. కానీ సెలబ్రిటీలకు ఎందుకు ఆర్థిక సాయం చేస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ (Mukku Avinash)కు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కష్టాల్లో ఉన్న ఆయన కుటుంబాన్ని ఆదుకుంది. అవినాష్ స్వస్థలం తెలంగాణలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం. ఐతే ఇటీవల అవినాష్ తల్లి లక్ష్మీరాజ్యం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఇప్పటి వరకు ఎన్నో డబ్బులు ఖర్చు చేశాడు అవినాష్. ఐనా నయం కాకపోవడంతో వైద్య ఖర్చుల కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం రూ.60వేల రూపాయలను మంజూరు చేసింది. వైద్య ఖర్చులకు అవసరమైన డబ్బులను ఇచ్చి ఆదుకుంది.
ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కును శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేశారు. ఆ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ''జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 60 వేల రూపాయల చెక్కును మంజూరు కాగ ఈరోజు హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లక్ష్మిరాజం కుమారుడు ముక్కు అవినాష్‌కు చెక్కును అందించడం జరిగింది.'' అని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ఐతే ముక్కు అవినాష్‌కు సీఎం రిలీఫ్ నిధులు మంజూరు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. సీఎం సహాయ నిధికి నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేస్తే కనీస సాయం చేయడంలేదని.. కానీ సెలబ్రిటీలకు ఎందుకు ఆర్థిక సాయం చేస్తున్నారని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ముక్కు అవినాష్ లాంటి ఆర్థికంగా మంచి పొజిషన్ ఉన్న వారికి డబ్బులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. అవినాష్ కోటీశ్వరుడేం కాదని.. సామాన్య కుటుంబం నుంచి వచ్చాడని, ప్రభుత్వం సాయం చేస్తే తప్పేముందని అభిప్రాయపడుతున్నారు.
కాగా, ముక్కు అవినాష్ జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా చేశాడు. ఎన్నో స్కిట్స్‌లో తనదైన స్టైల్లో కామెడీ చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్‌లో అవకాశం రావడంతో.. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. కామెడీ చేస్తూ హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను కూడా ఎంటర్టైన్ చేశాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. అదే మాటీవీలో పలు షోల్లో పాల్గొంటున్నాడు. ఆదివారం ప్రసారమయ్యే 'కామెడీ స్టార్స్' ప్రోగ్రామ్‌లో టీమ్ లీడర్‌గా ఉన్నాడు ముక్కు అవినాష్. అటు సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.