Home /News /movies /

JABARDASTH COMEDIAN MUKKU AVINASH ACCEPTED THE GREEN INDIA CHALLENGE PK

అదిరే అభిని సవాల్ చేసిన జబర్దస్త్ ముక్కు అవినాష్..

జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్ నిహాంత్ (avinash nihanth jabardasth)

జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్ నిహాంత్ (avinash nihanth jabardasth)

Jabardasth Mukku Avinash: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇందులో భాగంగానే అందరూ మొక్కలు నాటుతున్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇందులో భాగంగానే అందరూ మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పుడు జబర్దస్త్ రాకేష్ ఇచ్చిన ఛాలెంజ్‌ను మరో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ స్వీకరించాడు. ఈ సందర్భంగా ఈయన నానక్‌రామ్ గూడాలో మొక్కలు నాటాడు జబర్దస్త్ ముక్కు అవినాష్.
జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్ నిహాంత్ (avinash nihanth jabardasth)
జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్ నిహాంత్ (avinash nihanth jabardasth)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పాడు. ఈ మొక్కలు నాటడం అంటే మాకు చాలా సంతోషం కలుగుతుందని తెలిపాడు. ఒకప్పుడు హైదరాబాదులో ఎక్కడ చెట్టు కనిపించేది కాదని.. కానీ ఈ రోజు ఎక్కడ చూసినా కూడా పచ్చని చెట్లతోనే కనిపిస్తుందని చెప్పాడు అవినాష్.
జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్ నిహాంత్ (avinash nihanth jabardasth)
జబర్దస్త్ కమెడియన్స్ అవినాష్ నిహాంత్ (avinash nihanth jabardasth)

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత హారం స్ఫూర్తితో ఈ రోజు నగరం అంతా పచ్చగా మారిపోయిందని.. అందరం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే మంచి వాతావరణం అవసరమని.. కాబట్టి దీన్ని అందరూ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు జబర్దస్త్ అవినాష్. ఈయన వి6 యాంకర్ రాధతో పాటు జబర్దస్త్ కమెడియన్ప్ ఆదిరే అభి, కెవ్వు కార్తిక్‌లను మొక్కలు నాటాలని సవాల్ చేసాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు