Home /News /movies /

JABARDASTH COMEDIAN MOHAN CHANGES HIS ROLE BS

మళ్లీ మగాడిగా మారిన జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ మోహన్

జబర్దస్త్ మోహన్

Jabardasth : లేడీ గెటప్ వేస్తే హేలన చేసే ఈ రోజుల్లో.. ఏ మాత్రం జంకు లేకుండా ఆ వేషం వేసి ప్రేక్షకులను మెప్పించారు. అందులో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు.. తదితరులు ఉన్నారు.

    జబర్దస్త్ కామెడీ షో.. ఎందరో ఆర్టిస్టులకు అన్నం పెడుతున్న కార్యక్రమం. ఇంకెందరో కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తోంది. నటనపై ఆసక్తి, దానికి తగ్గట్లు శ్రమ చేయాలే గానీ.. ఎక్కడో కూర్చోబెడుతుంది. ఒక్క పూట తినడానికి తిండి కూడా లేని ఎందరో కళాకారులకు కడుపునిండా భోజనం పెడుతోంది. జనాల్లో కావాల్సినంత పాపులారిటీ సంపాదించి పెడుతోంది. అలా.. జబర్దస్త్ అనే చెట్టు నీడన.. దాని ఫలాలను, గాలిని పీల్చినవారు వందల్లో, వేలల్లో ఉన్నారు. ఈ వేషం వెయ్యను అనకుండా.. అంది వచ్చిన అన్ని అవకాశాలను ఒడిసి పట్టుకుంటే ఆ రోజు వారిదే. అలా, చాలా మంది ఆర్టిస్టులు వచ్చిన అవకాశాన్ని కాదనకుండా వేసి, విమర్శకుల మన్ననలు సైతం పొందారు. లేడీ గెటప్ వేస్తే హేలన చేసే ఈ రోజుల్లో.. ఏ మాత్రం జంకు లేకుండా ఆ వేషం వేసి ప్రేక్షకులను మెప్పించారు. అందులో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు.. తదితరులు ఉన్నారు.

    అందులో ప్రస్తుతం శాంతి స్వరూప్ తర్వాత ఎక్కువగా లేడీ గెటప్ వేస్తున్న వారిలో మోహన్ రెండో వాడు. ప్రేక్షకులు మోహన్ పేరును, అతడి రూపును మర్చిపోయి చాలా రోజులయ్యింది. లేడీ గెటప్ వేస్తేనే ఆదరిస్తున్నారు. అయితే, తాజాగా.. ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో అతడు మళ్లీ పురుషుడి గెటప్‌లో కనిపించనున్నాడు. ఆ గెటప్‌కు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. చాలా రోజుల తర్వాత మోహన్ ఆ గెటప్ వేయడంతో కొత్తగా కనిపించాడు.
    First published:

    Tags: Jabardasth apparao, Jabardasth comedy show, Jabardasth comey show, Jabardasth getup srinu, Jabardasth ramprasad, MLA Roja, Nagababu, Roja

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు