హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్ మహేష్‌‌కు పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

జబర్దస్త్ మహేష్‌‌కు పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా..?

జబర్దస్త్ మహేష్ పెళ్లి (jabardasth mahesh marriage)

జబర్దస్త్ మహేష్ పెళ్లి (jabardasth mahesh marriage)

Jabardasth Mahesh: జబర్దస్త్ కామెడీ షో నుంచి పరిచయమైన ఎంతో మంది నటుల్లో మహేష్ కూడా ఒకడు. మొదట్లో కిరాక్ ఆర్పీ స్కిట్స్ చేసి అక్కడే గుర్తింపు సంపాదించుకున్నాడు మహేష్.

జబర్దస్త్ కామెడీ షో నుంచి పరిచయమైన ఎంతో మంది నటుల్లో మహేష్ కూడా ఒకడు. మొదట్లో కిరాక్ ఆర్పీ స్కిట్స్ చేసి అక్కడే గుర్తింపు సంపాదించుకున్నాడు మహేష్. జబర్దస్త్ కమెడియన్‌గానే గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శతమానం భవతి చిత్రంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఆ తర్వాత రంగస్థలం చిత్రంతో మనోడి దశ మారిపోయింది. అప్పటి వరకు జబర్దస్త్ మహేష్ అనేవాళ్లు కాస్తా ఆ తర్వాత రంగస్థలం మహేష్ అంటున్నారు.

రామ్ చరణ్‌తో మహేష్ (ram charan jabardasth mahesh)
రామ్ చరణ్‌తో మహేష్ (ram charan jabardasth mahesh)

ఆ సినిమాలో రామ్ చరణ్ అసిస్టెంట్‌గా కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఇరక్కొట్టాడు మహేష్. ఆ వెంటనే మహానటిలో కూడా సత్యం పాత్రలో మెప్పించాడు. విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ నటించాడు మహేష్. మహానటి తర్వాత కార్తికేయ హీరోగా వచ్చిన గుణ 369లో నెగిటివ్ రోల్ చేసాడు. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మహేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తుంది.

జబర్దస్త్ మహేష్ పెళ్లి (jabardasth mahesh marriage)
జబర్దస్త్ మహేష్ పెళ్లి (jabardasth mahesh marriage)

ఈయన పెళ్లి చేసుకోబోతున్నాడు.. తాజాగా ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన మహేష్.. తన బంధువుల అమ్మాయినే పెళ్ళి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. లాక్‌డౌన్ తర్వాత పూర్తయిన వెంటనే మహేష్ పెళ్ళి ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆయన మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలే మహేష్ పెళ్లికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు