జబర్దస్త్ కమెడియన్స్ పైకి నవ్వుతూ ఉంటారు.. అందర్నీ నవ్విస్తూ ఉంటారు కానీ వాళ్ల రియల్ లైఫ్లో మాత్రం చాలా ఏడుపులు ఉంటాయి.. కన్నీరు పెట్టించే విషాదాలు కూడా ఉంటాయి. అవి తలుచుకున్నపుడు కచ్చితంగా మనకు కూడా కన్నీరు వస్తాయి. చాలా మంది కమెడియన్లు స్టేజీపై ఏ బాధలు లేనట్లు నవ్వుతూ కనిపిస్తారు.. కానీ వాళ్ల లోపల జీవితం ఒక్కసారి స్పృషిస్తే మాత్రం విషాదాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి బాధాకరమైన సంఘటనను ఓ జబర్దస్త్ కమెడియన్ గుర్తు చేసుకున్నాడు. తన తండ్రి చనిపోతే అర్ధరాత్రి పూట ఒక్కడినే ఏం చేయాలో తెలియక వర్షంలో ఏడుస్తూ కూర్చున్నానని చెప్పాడు.
జబర్దస్త్ కామెడీ షోలో చాలా మంది నటులు వస్తుంటారు.. అందులో ఒకడు లండన్ రాజు. హైపర్ ఆది స్కిట్లో ఓసారి ఈయన చేసిన కామెడీకి నాగబాబుతో పాటు రోజా, అనసూయ పడిపడి నవ్వారు. లండన్ డ్రాయర్లో లక్కీ ట్రిప్ అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్సే. ఆ ఒక్క డైలాగుతోనే జబర్దస్త్లో ఫిక్స్ అయిపోయాడు లండన్ రాజు. ఈయన అసలు పేరు వెంకటేశ్వర్లు అయితే లండన్ డ్రాయర్ జోకుతో అలా సెటిలైపోయాడు. వచ్చీ రాని మాటలతో నత్తిగా ఈయన చెప్పే డైలాగులు బాగానే నవ్విస్తాయి. అయితే ఈయన జీవితంలో మాత్రం చాలా విషాదం దాగుంది. ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈయనకు అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తారు.
ఓ సారి తన తండ్రి పొలం నుంచి వచ్చిన తర్వాత తన పూరి గుడిసెలో పడుకుంటే జ్వరం వచ్చి సీరియస్ అయిందని.. హాస్పిటల్కు వెళ్లడానికి కూడా వెహికిల్స్ లేకపోతే అదే రాత్రి చనిపోయాడని చెప్పాడు లండన్ రాజు. కనీసం ఊళ్లో వాళ్లు కూడా తన తండ్రి శవాన్ని చూడ్డానికి రాలేదని చెప్పాడు ఈయన. అప్పుడు ఏం చేయాలో తెలియక తను, అమ్మ ఏడుస్తూ కూర్చున్నామని.. అలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని చెప్పాడు ఈయన. ఆ తర్వాత రెండు బర్రెలు తెచ్చుకుని కాచుకుంటున్న తనకు హైపర్ ఆది ఛాన్సిచ్చాడని చెప్పాడు. అప్పటి వరకు గుడిసెలోనే ఉన్న తాను.. ఇప్పుడు రెండు రూమ్స్ వేసుకున్నానని చెప్పాడు. కాస్తో కూస్తో డబ్బు జబర్దస్త్ పుణ్యమా అని కూడబెట్టుకున్నానని చెబుతున్నాడు లండన్ రాజు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.