హైపర్ ఆది లేకుంటే నేను లేను.. బర్రెలు కాసుకునే నన్ను..

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది (Hyper Aadi)

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్స్ జీవితాల్లో పైకి కనిపించని లోపలి లోతు కోణాలు కూడా చాలానే ఉంటాయి. స్టేజీపై చూస్తున్నపుడు అంతా మామూలుగానే ఉంటుంది. నవ్వుతూనే కనిపిస్తుంటారు.

  • Share this:
జబర్దస్త్ కమెడియన్స్ జీవితాల్లో పైకి కనిపించని లోపలి లోతు కోణాలు కూడా చాలానే ఉంటాయి. స్టేజీపై చూస్తున్నపుడు అంతా మామూలుగానే ఉంటుంది. నవ్వుతూనే కనిపిస్తుంటారు. కానీ వాళ్ల జీవితంలోకి ఒక్కసారి తొంగిచూస్తే మాత్రం ఎన్నో కన్నీరు పెట్టించే విషాదాలు కూడా ఉంటాయి. అవి తలుచుకున్నపుడు కచ్చితంగా మనకు కూడా అయ్యో పాపం అనిపిస్తుంది. చాలా మంది కమెడియన్లు స్టేజీపై ఏ బాధలు లేనట్లు నటిస్తారంతే.. కానీ లోపల జీవితం స్పృషిస్తే విషాదాలు కోకొల్లలుగా ఉంటాయి. ఈ మధ్యే జబర్దస్త్ కమెడియన్ లండన్ రాజు కూడా తన గురించి చెప్పుకున్నాడు. అందులో తన తండ్రి మరణం కూడా చెప్పాడు ఈయన.

హైపర్ ఆది టీంలో చేసే లండన్ రాజు (Jabardasth Comedy show)
హైపర్ ఆది టీంలో చేసే లండన్ రాజు (Jabardasth Comedy show)


హైపర్ ఆది స్కిట్‌లో ఓసారి ఈయన చేసిన కామెడీకి నాగబాబుతో పాటు రోజా, అనసూయ పడిపడి నవ్వారు. లండన్ డ్రాయర్‌లో లక్కీ ట్రిప్ అంటూ ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్సే. ఆ ఒక్క డైలాగుతోనే జబర్దస్త్‌లో ఫిక్స్ అయిపోయాడు లండన్ రాజు. ఈయన అసలు పేరు వెంకటేశ్వర్లు అయితే లండన్ డ్రాయర్ జోకుతో అలా సెటిలైపోయాడు. వచ్చీ రాని మాటలతో నత్తిగా ఈయన చెప్పే డైలాగులు బాగానే నవ్విస్తాయి. అయితే ఈయన జీవితంలో మాత్రం చాలా విషాదం దాగుంది. ఒంగోలు దగ్గర చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఈయనకు అమ్మ, నాన్న వ్యవసాయం చేస్తారు.

హైపర్ ఆది టీంలో చేసే లండన్ రాజు (Jabardasth Comedy show)
హైపర్ ఆది టీంలో చేసే లండన్ రాజు (Jabardasth Comedy show)


ఓ సారి తన తండ్రి పొలం నుంచి వచ్చిన తర్వాత తన పూరి గుడిసెలో పడుకుంటే జ్వరం వచ్చి సీరియస్ అయిందని.. హాస్పిటల్‌కు వెళ్లడానికి కూడా వెహికిల్స్ లేకపోతే అదే రాత్రి చనిపోయాడని చెప్పాడు లండన్ రాజు. కనీసం ఊళ్లో వాళ్లు కూడా తన తండ్రి శవాన్ని చూడ్డానికి రాలేదని చెప్పాడు ఈయన. అప్పుడు ఏం చేయాలో తెలియక తను, అమ్మ ఏడుస్తూ కూర్చున్నామని.. అలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని చెప్పాడు ఈయన. చదువు లేదు.. వ్యవసాయం తప్ప మరో పని తెలియదు అలాంటి సమయంలో హైపర్ ఆది దేవుడిలా వచ్చాడంటున్నాడు లండన్ రాజు.
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)

తండ్రి చనిపోయిన తర్వాత తర్వాత రెండు బర్రెలు తెచ్చుకుని కాచుకుంటున్న సమయంలో హైపర్ ఆది ఛాన్సిచ్చాడని చెప్పాడు. కెమెరా అంటే కూడా తెలియని తనను ఈ రోజు కనీసం పది మంది గుర్తు పడుతున్నారంటే మాత్రం అది పూర్తి ఆది అన్న చేసిందే అంటున్నాడు రాజు. ముఖ్యంగా తను అందరి టీమ్స్‌లో చేస్తానని.. అందరూ తనను బాగా చూసుకుంటున్నారని చెప్పాడు. వెళ్లిపోయిన చంద్ర కూడా చాలా మంచివాడని.. తను ఆయన టీంలో చేసినపుడు చాలా బాగా చూసుకున్నాడని గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి బర్రెలు కాచుకునే తనను జబర్దస్త్ కమెడియన్‌ను చేసాడంటున్నాడు లండన్ రాజు.
Published by:Praveen Kumar Vadla
First published: