ఇంత పెద్ద కామెంట్స్ ఎవరు చేసారు..? ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన షో గురించి నోటికొచ్చినట్లు మాట్లాడతారా..? ఇంతకీ అంత దారుణంగా ఎవరు మాట్లాడారు అనేగా మీ అనుమానం..? జబర్దస్త్‌లో మూడేళ్లకు పైగా 300 స్కిట్స్ చేసిన ఓ కమెడియన్ ఈ వ్యాఖ్యలు చేసాడు. అయినా తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షోతో పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో కోట్ల మందిని నవ్విస్తున్న షో ఇది. ఈ ఒక్క షో నుంచి చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తమను తాము నిరూపించుకుని స్టార్స్ అయ్యారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన షో కూడా ఇది. అలాంటి షో నుంచి వచ్చిన కిరాక్ ఆర్పీ ఇప్పుడు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అసలు జబర్దస్త్ కామెడీ షో ఎవడికి లైఫ్ ఇవ్వలేదని కామెంట్ చేసాడు.
ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలోనే నటించిన ఈయన ఇప్పుడు అక్కడ మానేసి అదిరిందిలో చేస్తున్నాడు. నాగబాబుతో పాటే జబర్దస్త్ మానేసి అక్కడికి వెళ్లాడు ఆర్పీ. చమ్మక్ చంద్ర కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అయితే ఆయన మాత్రం తనకు జబర్దస్త్ ఎప్పుడూ లైఫ్ ఇచ్చిన షో.. దానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. కానీ కిరాక్ ఆర్పీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసాడు. లైఫ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద పదమని.. దాన్ని ఎక్కడ బడితే అక్కడ వాడకూడదని చెప్పాడు. లైఫ్ ఇవ్వడం అంటే నువ్వు చేయలేవు అనుకున్న వాన్ని కూడా తీసుకొచ్చి.. చేయగలవని ప్రోత్సహించడం అని జబర్దస్త్‌లో అలా ఎవరూ చేయలేదని చెప్పాడు ఆర్పీ.
వాళ్లకు మేం అవసరం.. అది మాకు ఓ అవకాశం అంతేకానీ లైఫ్ ఇచ్చేంత సినిమా ఎవరికి లేదని కామెంట్ చేసాడు ఆర్పీ. అక్కడ అందర్నీ వాడుకున్నారని చెప్పాడు ఆర్పీ. చస్తే ఇక తాను ఈటీవీ జోలికి కానీ.. జబర్దస్త్ వైపు కానీ వెళ్లనని సంచలన కామెంట్స్ చేసాడు ఈయన. తన టాలెంట్‌తోనే పైకి వచ్చానని.. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నానని.. అంతేకానీ ఎవడో పైకి తీసుకొస్తే రాలేదని చెప్పాడు ఈయన. ఆర్పీ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఎంత కాదనుకున్నా కూడా రోడ్డు మీద ఉన్న నిన్ను తీసుకొచ్చి లైఫ్ ఇచ్చిన షో గురించి ఇప్పుడు అలా మాట్లాడటానికి సిగ్గు లేదా నీకు అంటూ నెటిజన్లు ఆర్పీపై మండి పడుతున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చేటప్పుడు కిరాక్ ఆర్పీతో వాళ్లకు గొడవ అయిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈయన మాటలు విన్న తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. ఏదేమైనా కూడా లైఫ్ ఇచ్చిన షో గురించి ఇలా మాట్లాడటం మాత్రం నిజంగానే తప్పు అంటున్నారు విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.