హోమ్ /వార్తలు /సినిమా /

కరోనా లా‌క్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్..

కరోనా లా‌క్‌డౌన్ నేపథ్యంలో వ్యవసాయం చేస్తోన్న జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ లోగో

జబర్దస్త్ లోగో

Jabardasth Comedy Show | ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

  ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అత్యవసర సేవలు తప్ప మిగతావన్ని లాక్‌డౌన్‌లో పరిధిలో ఉన్నాయి. అందులో సినీ పరిశ్రమ కూడా ఉన్నాయి. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోయాయి. షూటింగ్స్ ఆగిపోవడంతో పెద్ద హీరోలకు, హీరోయిన్స్‌కు ప్రాబ్లెమ్స్ లేకపోయినా... చిన్న చిన్న రోల్స్ వేసేవాళ్లు, మిగతా వాళ్లకు పని లేకుండా పోయింది. ఇక రియాలిటీ షోస్ చేసే వాళ్ల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇక జబర్ధస్త్ షోలో పార్టిసిపేంట్స్ కూడా పని లేకుండా పోయింది. తాజాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో వాళ్లను పోషించుకోవడానికి రైతు అవతారం ఎత్తాడు జబర్ధస్త్ కమెడియన్. ఇపుడు తనకు సంబంధించిన  భూముల్లో వ్యవసాయ  పనులు చేస్తున్నాడు.

  ' isDesktop="true" id="507200" youtubeid="7aDXPQ05rH4" category="movies">

  వరి పంట కోతల తర్వాత వడ్లను తూర్పారా పడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జీవన్ విషయానికొస్తే.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ పలు టీవీ చానెల్స్‌లో యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ ఆయన టాలెంట్‌ను పసిగట్టిన కిరాక్ ఆర్.పి. చమ్మక్ చంద్ర తమ స్కిట్‌లో చాన్స్ ఇచ్చారు. ఇక జబర్ధస్త్ కంటే ముందు ఎన్నో స్టేజ్ షోలతో ప్రేక్షకులను అలరించాడు జీవన్. ముందు నుంచి జీవన్‌కు సంగీత దర్శకుడు కావాలనే కోరిక బలంగా ఉంది. ఏనాటికైనా సంగీత దర్శకుడిగా ప్రూవ్ చేసుకుంటానని చెబుతున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు