JABARDASTH COMEDIAN HYPER AADI WHO HAS THE TITLE HYPER BEFORE THE NAME HYPER AADI TA
Hyper Aadi: హైపర్ ఆది పేరు ముందు హైపర్ అనే బిరుదు ఎవరిచ్చారంటే..
హైపర్ ఆది (File/Photo)
తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌లో జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ షోలో కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆలీతో సరదగా కార్యక్రమంలో తనకు హైపర్ అనే బిరుదు ఎవరు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించాడు.
తెలుగు టెలివిజన్ ఛానెల్స్‌లో జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు హైపర్ ఆది సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ షోలో కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపించే హైపర్ ఆది. . తాజాగా ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో యాంకర్ వర్షిణితో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తాను జబర్ధస్త్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం వెనక ఎంత కష్టపడింది. అలానే జబర్ధస్త్ కామెడీ షో నుంచి సినిమాల్లోకి ప్రమోషన్ పొందడం వెనక ఉన్న కృషిని ఆలీతో సరదగా ప్రోగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ ప్రోగ్రామ్‌లో హైపర్ ఆదితో పాటు యాంకర్ వర్షిణి కూడా హైపర్ ఆదితో కలిసి వేదికను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె కూడా యాంకర్‌గా మారడం వెనక ఎంత కృషి ఉందో వివరించింది. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. జబర్ధస్త్ కామెడీ షోలో తనకు పేరు ఆది ముందు హైపర్ అని ఎవరు బిరుదు ఇచ్చారనే విషయాన్ని వివరించాడు.
దీంవతో వర్షిణి.. కిల కిలా అంటూ నవ్వులు పూయించింది. ఇక హైపర్ ఆది పెళ్లి ఎపుడు చేసుకుంటావు అని ప్రశ్నించగా.. నేను సుఖంగా ఉండటం నీకు ఇష్టం లేదా అంటూ మరో పంచ్ వేసాడు హైపర్ ఆది. సోలో బ్రతుకు సో బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా సరదాగా సాగిపోయే ఈ షోను చూడాలంటే ఈ రోజు రాత్రి 9.30 వరకు వెేచి చూడాల్సిందే. అపుడు కానీ హైపర్ ఆదికి ఆ బిరుదు ఎవరిచ్చారనే సంగతి ప్రేక్షకులకు తెలియదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.