సుడిగాలి సుధీర్‌ను ఫుల్లుగా వాడుకుంటున్న హైపర్ ఆది..

సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)

Jabardasth: జబర్దస్త్ కామెడీ షోలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్లు ఇద్దరే.. ఒకరు సుడిగాలి సుధీర్ అయితే మరొకరు హైపర్ ఆది. ఈ ఇద్దరి స్కిట్స్‌కు యూ ట్యూబ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది.

  • Share this:
టైటిల్ చూసి మరోలా అనుకోవద్దు.. జబర్దస్త్ కామెడీ షోలో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న కమెడియన్లు ఇద్దరే.. ఒకరు సుడిగాలి సుధీర్ అయితే మరొకరు హైపర్ ఆది. ఈ ఇద్దరి స్కిట్స్‌కు యూ ట్యూబ్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్లు చేసే ఒక్కో స్కిట్ కనీసం 40 లక్షల నుంచి కోటి వరకు వ్యూస్ వస్తుంటాయి. హైపర్ ఆది చేసే స్కిట్స్ అయితే ఏకంగా 3 నుంచి 4 కోట్ల వ్యూస్ తీసుకొచ్చినవి కూడా ఉన్నాయి. ఈయన హైయ్యస్ట్ వ్యూస్ ఏకంగా 5 కోట్ల 70 లక్షలు. మరోవైపు సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ కూడా దాదాపు కోటికి పైగానే వస్తుంటాయి. అలాంటి ఇద్దరు ట్రెండింగ్ కమెడియన్లు కలిసి స్కిట్ చేస్తే అరాచకమే.

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోజా (Jabardasth Show Roja Sudigali Sudheer Hyper Aadi)
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రోజా (Jabardasth Show Roja Sudigali Sudheer Hyper Aadi)


ఈ విషయంలోనే సుధీర్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్నాడు హైపర్ ఆది. తన స్కిట్‌లో కావాల్సినప్పుడల్లా సుధీర్‌ను కూడా తీసుకొస్తున్నాడు. వీళ్లు కలిసి చేసే స్కిట్స్ కామెడీ కూడా ఓ రేంజ్‌లో పేలుతుంది. మరీ ముఖ్యంగా సుధీర్‌పై ఆది వేసే పంచులకు జడ్జిలతో పాటు ప్రేక్షకులు కూడా పడిపడి నవ్వుకుంటున్నారు. లేటెస్ట్ స్కిట్‌లో కూడా సుడిగాలి సుధీర్‌ను లక్ష్యంగా చేసుకుని వేసిన ప్రతీ పంచ్ డైలాగ్ అదిరిపోయింది. కడుపులు చెక్కలయ్యేలా నవ్వించింది. ముఖ్యంగా అమ్మాయిలతో కనెక్ట్ చేస్తూ సుధీర్‌పై వేసే జోకులు అద్భుతంగా పేలుతుంటాయి.

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)


సుధీర్ ప్లే బాయ్ ఇమేజ్‌ను ఆది కూడా సూపర్‌గా వాడుకుంటున్నాడు. తన స్కిట్స్‌లో కొన్నిసార్లు సుధీర్‌ను మెయిన్ లీడ్‌లో పెట్టుకుని రాసుకుంటున్నాడు. అలా చేసి స్కిట్స్ కొట్టేస్తున్నాడు హైపర్ ఆది. తన టీంలో ఎంతమంది ఉన్నా కూడా ఆది మాత్రం పూర్తిగా తనపైనే ఫోకస్ చేసుకుంటాడు. అందుకే రైజింగ్ రాజు కూడా టీం లీడర్ అయినా అదెవ్వరికీ తెలియదు. అలా మెయింటేన్ చేస్తున్నాడు ఆది. మొత్తానికి సుధీర్ తోడుగా కుమ్మేస్తున్నాడు ఈ కుర్ర కమెడియన్.
Published by:Praveen Kumar Vadla
First published: