టీవీ తెరపై జబర్ధస్త్ ఫేం సుడిగాలి సుధీర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్నారు. ప్రోగ్రామ్ లో స్కిట్స్ తో పాటు యాంకరింగ్ లోనూ.. ఢీ లాంటి కార్యక్రమాల్లో టీం లీడర్ గా తనదైన ముద్ర వేసాడు. స్మాల్ స్క్రీన్ పై వచ్చిన ఇమేజ్‌తో బిగ్ స్క్రీన్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. వెండితెరపై సుధీర్ ప్రయత్నం వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ స్మాల్ స్క్రీన్ నే నమ్ముకున్నాడు. ఐతే... సుడిగాలి సుధీర్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్ధస్త్ లోనూ... ఢీ వేదికపైనా సుధీర్ ఓ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రష్మీతో సుధీర్ కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. స్మాల్ స్క్రీన్ పై వీరిద్దరి జంట సూపర్ హిట్ అయింది. వీరిద్దరు కలిసి చేసిన డాన్స్ లు, ఫెస్టివల్ స్పెషల్ కార్యక్రమాలు దాదాపుగా అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరు స్మాల్ స్క్రీన్ పై చూసిన జనం వీళ్లు నిజ జీవితంలోనూ జత కడతారా అనేంతగా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరి జంటను పక్కనబెడితే సుధీర్ అమ్మాయిల పిచ్చోడనే ముద్రపడింది. అంతేకాదుసుధీర్ పాల్గొనే కార్యక్రమాల్లో జడ్జ్ లు, యాంకర్లు కూడా అతనిపై ఆ ముద్ర వేశారు.
సుడిగాలి సుధీర్‌ను పక్కన పెడితే..... పంచ్ డైలాగ్ తో ప్రేక్షకులును కట్టిపడేస్తున్న హైపర్ ఆది కూడా సుధీర్ ను అందుకునేందుకు పోటీ పడుతున్నాడు. జబర్దస్త్ చేస్తూనే సినిమాల్లో కమెడియన్ వేశాలు వేస్తున్నాడు. అంతే కాకుండా ఢీ షోలో సుధీర్-రష్మి జంట టీం లీడర్లుగా ఉంటే... మరో టీం లీడర్లుగా హైపర్ ఆది-వర్షిణి టీం లీడర్లుగా ఉన్నారు. ఇన్నాళ్లు పంచ్ డైలాగ్ లకే పరిమితమైన ఆది ఈ మధ్య సుధీర్ మాదిరిగా లవర్ బాయ్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. జబర్ధస్త్ లో అనసూయతో కలిసి చిందులేసినా.... ఆ ఇమేజ్ రాలేదు. అయితే... తాజాగా హైపర్ ఆది, వర్షిణి తో కలిసి ఢీ వేదిక పై ఓ రొమాంటిక్ సాంగ్ లో వేసిన చిందులు చూసి ఆడియన్స్‌తో పాటు జడ్జెస్ కూడా నోరెళ్లబెట్టారు. డాన్స్ స్టెప్స్ విషయం పక్కన పెడితే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది అనిపించుకునే ప్రయత్నం చేశాడు ఆది. ఇది ఆరంభం మాత్రమే... మున్ముందు మరిన్ని సాంగ్స్ లో అలరిస్తామని ఓ సిగ్నల్ అయితే ఇచ్చాడు హైపర్ ఆది. వీరి డాన్స్ చూసి సుధీర్-రష్మిలు కూడా ఎంకరేజ్ చేశారు. అంతేకాదు... రష్మీ-సుధీర్ లను టీజ్ చేసినట్టుగా ఆది-వర్షిణిలను కూడా న్యాయ నిర్ణేతలు సహా.... యాంకర్లు కూడా టీజ్ చేస్తున్నారు. అంటే.... సుధీర్ ఇమేజ్ కోసం ఆది కూడా ప్రయత్నిస్తున్నట్టేగా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Anchor varshini, Dhee Dance Reality Show, Hyper Aadi, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood